Add Zee Business As A Preferred Source
App

Budha Gochar: వృశ్చిక రాశిలో బుధుడు.. ఈ రాశుల వారి సుడి మాములుగా లేదు.. జాక్ పాట్ కొట్టబోతున్నారు..

Written ByTA Kiran Kumar
Published: Dec 04, 2025, 06:34 AM IST|Updated: Dec 04, 2025, 06:35 AM IST

Budha Gochar: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. దీని వలన కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. అలా నవగ్రహాలు నిరంతరం 12 రాశుల్లో సంచరించడం కొన్ని రాశులకు శుభాశుభా యోగాలు కలుగుతుంటాయి. రాబోయే బుధ సంచారము 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. 

Budha Gocharam 1/5

బుధ గోచారం

ప్రస్తుతం తులారాశిలో సంచరిస్తున్న  బుధుడు త్వరలో తన మార్గాన్ని మార్చుకుని వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పు కొన్ని రాశులకు సానుకూల ఫలితాలను ఇవ్వబోతుంది.ఈ నెలో బుధుడి సంచారం కారణంగా ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం చేకూరబోతుందో తెలుసుకుందాం..

Makara Rasi 2/5

మకర రాశి

మకర రాశి: బుధ సంచారము మకర రాశి వారికి స్వర్ణయుగం అని చెప్పాలి. మీరు చేసే పనిలో  సీనియర్ల మద్ధతు పొందుతారు. పై వారి నుండి  ప్రశంసలను అందుకుంటారు. జీవితంలో కొత్త ఎత్తులను చేరుకోవడానికి ఇదే సరైన సమయం. వ్యాపార పరంగా  వృద్ధి ఉంటుంది.  మీ ప్రణాళికలు ఫలిస్తాయి. శుభ వార్తలు వింటారు. వివాహాం కానీ వారికి త్వరలో పెళ్లి నిశ్చయం అవుతుంది. కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి ఇదే అనువైన సమయం.  మీ తల్లిదండ్రులతో ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు.  

Vrushchika Rasi 3/5

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి: ఈ బుధ సంచారము వృశ్చికరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంబోతుంది. ఈ రాశిలోనే బుద్దికి చదువుకు కారణమైన  బుధుడు  సంచరించడం వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలకు అందించబోతున్నాడు. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఉత్తీర్ణతీ సాధిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు అందుకుంటారు.  ఉద్యోగులు తన జీవితంలో స్థిరత్వాన్ని తెచ్చుకుంటారు.  సింగిల్ జీవనం సాగించే వారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల భక్తి పెరుగుతుంది.

Kumbha Rasi 4/5

కుంభ రాశి

కుంభ రాశి: కుంభ రాశి వ్యక్తులు బుధ సంచారము వలన గణనీయంగా అనేక లాభాలను అందుకోబోతున్నారు. వృత్తి నిపుణులకు ఇది మంచి కాలం.  వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు అందుకుంటారు.  వైవాహిక జీవితంలో విభేదాలు క్రమంగా తొలిగిపోతాయి. సంబంధాలలో మెరుగుదల ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.

Disclaimer5/5

గమనిక

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, పండితులు వివిధ జ్యోతిష్య హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాల ఆధారంగా చెప్పబడింది. ఈ సమాచారాన్నే మేము మీకు అందించాము. జీ మీడియా దీనిని ధృవీకరించడం లేదు.