Central Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌గా జీతాల పెంపు ఉండనుంది. అక్టోబర్ 15వ తేదీ కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 55 శాతం డీఏ పెంపు అమలు అవుతోంది. ఈసారి 3 శాతం డీఏ పెంపు ఉండే ఛాన్ప్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మొత్తం డీఏ 58 శాతానికి చేరుతుంది. మరీ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
1/7కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం ఏడాదికి రెండుసార్లు డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. AICPI (ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్) డేటా ఆధారంగా ఎంత డీఏ పెంచాలనే విషయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.
2/7జనవరి నుంచి జూన్ 2025 వరకు ఉన్న డేటా ఆధారంగా 3 శాతం డీఏ పెంపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగుతుంది.
3/73 శాతం డీఏ పెంపుతో ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందంటే.. ఉదాహరణకు బేసిక్ పే రూ.18 వేలు అని అనుకుందాం.. ప్రస్తుతం రూ.9,900 డీఏ అందుకుంటుండగా.. పెంపు తరువాత రూ.10,440కి పెరుగుతుంది. అంటే నెలకు రూ.540 పెంపు ఉంటుంది.
4/7అదేవిధంగా రూ.35,400 బేసిక్ పే ఉన్నవారికి రూ.1,062 పెంపు ఉంటుంది. రూ.44,900 ప్రాథమిక జీతం ఉన్నవారికి రూ.1,347 జీతం పెరుగుతుంది. క్యాబినెట్ సెక్రటరీ వంటి ఉన్నత పదవుల్లో ఉన్నవారికి అధికారులకు నెలకు రూ.7,500 అదనపు డీఏ అందుతుంది.
5/7జీతాల పెంపు ప్రకటన ఎప్పుడు ఉన్నా.. జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన పెండింగ్ డీఏలు కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుంది.
6/7ఉద్యోగి జీతం ప్రతి నెలా రూ.1,347 పెరిగితే.. అక్టోబర్ నెల జీతంలో రూ.4,041 బకాయి అందుకుంటారు. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీగా జమ కానుంది.
7/7గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.