8th Pay Commission Latest News Updates: కొత్త పే కమిషన్ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు అప్‌డేట్ ఇచ్చింది. పే కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంలో జాప్యంపై అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే చైర్మన్, సభ్యుల నియామకం జరుగుతుందని ఆయన చెప్పారు.
1/9జనవరి 16న మోదీ సర్కార్ 8వ వేతన సంఘాన్ని ప్రకటించగా.. ఇప్పటివరకు కమిటీ నియామకం జరగలేదు. తాజాగా రాజ్యసభలో 8వ వేతన సంఘం చైర్మన్, సభ్యుల నియామకాన్ని ఎప్పుడు ప్రకటిస్తారనే విషయంపై ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చింది.
2/97వ వేతన సంఘం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. కొత్త పే కమిషేన్ పదవీ కాలం జనవరి 1, 2026 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే చైర్మన్, సభ్యుల నియామకం, అలాగే నిబంధనలను (ToR) ఖరారు చేయడంలో కేంద్రం జాప్యం చేస్తోంది.
3/9కేంద్రం ప్రభుత్వం ToRని నోటిఫై చేస్తుందని దాదాపు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ToR నోటిఫై అయితే సిబ్బందికి జీతాలు, పెన్షన్‌లను సవరించడానికి సిఫార్సులకు మార్గం సుగమం అవుతుంది.
4/9జనవరిలో ప్రభుత్వం సిఫార్సులను కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం (స్టాఫ్ సైడ్)- NC JCM తమ డిమాండ్స్‌ను ఇప్పటికే కేంద్ర కేబినెట్ కార్యదర్శికి సమర్పించింది.
5/9ఈ నేపథ్యంలో 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటును ఆమోదిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసే తేదీ గురించి ఎంపీ సాగరిక ఘోష్ ప్రభుత్వాన్ని రాజ్యసభలో అడిగారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. కమిషన్ అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే సభ్యుల నియామకం జరుగుతుందన్నారు.
6/9రక్షణ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటికే సూచనలు, సిఫార్సులను కోరినట్లు ఆయన చెప్పారు. కమిషన్ తన సిఫార్సులను నిబంధనలలో (ToR) నిర్దేశించిన కాల పరిమితిలోపు సమర్పిస్తుందని అన్నారు.
7/9ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి ఇన్‌పుట్‌లను స్వీకరించిందని.. సరైన సమయంలో అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని తెలిపారు. కొత్త పే కమిషన్ గురించి ప్రభుత్వం నుంచి స్పందనరావడంతో ఉద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
8/97వ వేతన సంఘం మరో ఐదు నెలల్లో ముగియనుండగా.. కొత్త కమిషన్ సిఫార్సులు 2027 మధ్యలో లేదా 2028 ప్రారంభంలో అమలు అయ్యే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
9/9మరోవైపు డీఏ పెంపు గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ఎంత ఉంటుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. చివరగా 2 శాతం డీఏ పెంచగా.. ఈసారి 3 శాతం పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది.