Railway Recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. కేవలం 10వ తరగతి అర్హతతోనే.. రైల్వేలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దక్షిణ తూర్పు రైల్వేలో 1,785 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు.. డిసెంబర్ 17 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు.
1/5భారత దక్షిణ తూర్పు రైల్వే మరోసారి భారీ అప్రెంటిస్ నియామక ప్రకటనను విడుదల చేసింది. ముఖ్యంగా 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ITI సర్టిఫికేట్ ఉన్నవారు అప్రెంటిస్ పోస్టులకు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే నవంబర్ 17న ప్రారంభం కాగా.. చివరి తేదీ డిసెంబర్ 17 వరకు ఉంది.
2/5ఇక ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు కాగా.. గరిష్ట వయస్సు జనవరి 1, 2026 నాటికి 24 ఏళ్లు మించకూడదు. ఇక SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
3/5అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT నుంచి ITI సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ అర్హతలు ఉన్నవారే ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని రైల్వే బోర్డ్ సూచించింది.
4/5ఈ నియామక ప్రక్రియ ద్వారా దక్షిణ తూర్పు రైల్వే కింద వివిధ వర్క్‌షాప్‌లు, విభాగాల్లో మొత్తం 1,785 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రైల్వే డివిజన్‌లలో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ భవిష్యత్ రైల్వే ఉద్యోగాలలో, ముఖ్యంగా టెక్నికల్ పోస్టుల నియామకాల్లో, ఉపయోగపడేలా రూపొందించారు.
5/5రైల్వే ఉద్యోగాలకి అప్లయ్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు జనరల్/OBC/ ఇతర అభర్థులకు రూ. 100 కాగా.. SC, ST, PWD, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.