Free bus travel for kps students: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక బంపర్ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వేల మంది బడి పిల్లలు ఇకపై ఫ్రీగా బస్సుల్లో పాఠశాలలకు వెళ్లొచ్చు, రావొచ్చు. చాలా మంది పిల్లలకు స్కూల్ చాలా దూరంలో ఉండటం వల్ల.. నడవటమో లేదా ప్రైవేట్ వెహికల్స్‌లో వెళ్లాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వం పిల్లల కోసం ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా బస్సును తీసుకొచ్చింది.
1/6కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక పబ్లిక్ స్కూల్స్ (KPS) విద్యార్థుల కోసం అదిరిపోయే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇక నుండి పిల్లలు పాఠశాలలకు ఉచితంగానే వెళ్లవచ్చు. చాలా మంది పిల్లలకు బడికి వెళ్లడం అంత సులువైన విషయం కాదు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పిల్లలు స్కూల్‌కు వెళ్లడానికి చాలా దూరం నడవాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వం KPS స్కూల్స్‌లో చదివే పిల్లలు ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా బస్సులో ప్రయాణించడానికి.. ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
2/6ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పాఠశాల నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే విద్యార్థులకు వర్తిస్తుంది. ముఖ్యంగా బస్సు సౌకర్యం తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఈ ఫ్రీ బస్ ప్రయాణం చాలా మంది పిల్లలకి ఎంతో సహాయపడుతుందని విద్యాశాఖ అధికారులు చెప్పారు.
3/6కర్ణాటక ప్రభుత్వ స్కూల్స్ (KPS) ప్రైమరీ నుండి ఇంటర్ వరకు ఒకేచోట విద్యను అందిస్తున్నాయి. ఇవి పట్టణ, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు చాలా ఉపయోగపడుతున్నాయి. కానీ పిల్లల ఇంటి నుండి స్కూల్‌కి మధ్య ఉన్న దూరం ఎప్పటినుండో పెద్ద సమస్యగా మారింది. రోజూ ఉదయాన్నే పిల్లలు బడికి రావడానికి 5,6 కిలోమీటర్లు నడవడం అంటే చాలా కష్టం.
4/6మరికొందరేమో అటు నడవలేక ఇటు ప్రైవేట్ బస్సులకు ఛార్జీలు చెల్లించలేక స్కూల్ మానేస్తున్నారు. అందుకే ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం.. ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
5/6బస్సులు సమయానికి నడుస్తాయని, KPS స్కూళ్ల సమీపంలో అందుబాటులో ఉంటాయని.. రాష్ట్రం స్థానిక రవాణా శాఖలతో కలిసి పనిచేస్తుందని విద్యాశాఖ మంత్రి అన్నారు. ఈ ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం ఏ తరగతి అయినా సరే.. KPS స్కూల్స్‌లోని విద్యార్థులందరికీ వర్తిస్తుందన్నారు.
6/6ఈ పథకం ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బంది ఉండి తమ పిల్లలను పాఠశాలలకు పంపలేని కుటుంబాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్‌కు మానేయకుండా వస్తారని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.