Business Ideas: ప్రక్రుతిలో పువ్వుల అందం.. ఆడవారి మాధుర్యం లాగా ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. అందులో బంతిపూలు ఎప్పటికీ ప్రత్యేకమైనవి. పండుగలు,పెళ్లిళ్లు, శుభకార్యాలు, వేడుకలు ఏవైనా అలంకరణలో బంతిపువ్వు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. వాటి రంగు,వాసన, ఆకర్షణ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తాయి. ఈ కారణంగా మార్కెట్లో బంతిపూలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.
1/7అయితే మరో రెండు రోజుల్లో బతుకమ్మ, దేవి నవరాత్రులను ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో బంతిపువ్వులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే బంతిపువ్వులతో బతుకమ్మను పేర్చుతుంటారు. అలాగే దుర్గామాతకు బంతిపువ్వులు అంటే చాలా ఇష్టం. ఈ కారణంగా బంతిపువ్వులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో బంతిపువ్వులతో బిజినెస్ చేస్తే భారీగా లాభాలను పొందవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
2/7ఒక ఎకరా భూమిలో సగటున 5,000 నుంచి 8,000 కిలోల వరకు పువ్వులు దిగుమతి అవుతాయి. కార్తీక మాసం లేదా దసరా, దీపావళి లాంటి సీజన్‌లో కిలో ధర రూ.200 వరకు చేరుతుంది. కేవలం 5,000 కిలోల దిగుబడితోనే రైతులు రూ.10 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. పండుగల సమయంలో డిమాండ్ పెరిగి ధరలు రెట్టింపు అవుతాయి. కాబట్టి రైతులు ముందుగానే పంట సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు.
3/7బంతిపూల సాగులో సమయం చాలా కీలకం. ఈ పంట 3–4 నెలల్లో కోతకు వస్తుంది. రైతులు 8–10 సార్లు కోత చేయవచ్చు. కార్తీక మాసానికి పూలు అందుకోవాలంటే సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో నాటడం మంచిది. జూలై–ఆగస్టులో నాటితే వర్షాల ప్రభావం వల్ల మొక్కలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
4/7ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఆఫ్రికన్ బంతి రకం విత్తనాలు వాడుతారు. ఇవి పెద్ద పువ్వులు ఇస్తాయి, అలాగే దిగుబడీ ఎక్కువ. పెళ్లిళ్లు, వేడుకల్లో అలంకరణలకు ఇవే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఏపీలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలు బంతిపూల ప్రధాన ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి.
5/7బంతిపూలకు ఎక్కువ నీటి అవసరం ఉండదు. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు వారానికి రెండు సార్లు నీరు పోతే సరిపోతుంది. పువ్వులు పూసే సమయంలో మాత్రం ప్రతిరోజూ నీరు అవసరం. పంట నాణ్యత కోసం సేంద్రియ ఎరువులతో పాటు యూరియా, డీఎపీ, పొటాష్ సరైన మోతాదులో వేస్తే దిగుబడి మెరుగుపడుతుంది. పూత సమయంలో ఫోలియర్ స్ప్రే వాడితే పువ్వుల రంగు, పరిమాణం మెరుగవుతుంది.
6/7బంతిపూల తోటలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యారెట్, ముల్లంగి వంటి కూరగాయలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఇవి అదనపు ఆదాయం ఇవ్వడమే కాకుండా నేల సారాన్ని కాపాడుతాయి. కొత్తగా వ్యవసాయం లేదా బిజినెస్ ఆలోచిస్తున్న వారు కూడా ఈ విధంగా మల్టీ క్రాప్ మోడల్ ద్వారా లాభాలను పెంచుకోవచ్చు.
7/7బంతిపూలు పండుగలకే కాదు, రైతులకు కూడా పండుగనే. సరైన సమయం, సరైన పద్ధతిలో సాగు చేస్తే బంగారు లాభాలు అందించే పంటగా మారుతుంది. అలంకరణల మార్కెట్ ఎప్పుడూ బలంగానే ఉండటం వల్ల బంతి పూలకు భవిష్యత్తులో కూడా డిమాండ్ తగ్గే అవకాశం లేదు.