Business Ideas: డబ్బు సంపాదించాలని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు నెలాఖరు వరకు చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఎందుకంటే నేటి కాలంలో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువా పెరిగాయి. చాలా మందికి ఉద్యోగం చేస్తున్నా డబ్బులు సరిపోవడం లేదు. కొంతమంది భార్యభర్తలు ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేస్తుంటే..ఎంతోకొంత మిగులుతుంది. చాలా మందికి ఆదాయం సరిపోక ఏం చేయాలో అర్థం కాదు.
Business Ideas: ఉద్యోగం చేయలేక ఇంటి పనులకు మాత్రమే పరిమితమయ్యే మహిళలకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము చెప్పబోయే బిజినెస్ ఇంట్లో ఖాళీ సమయంలో చేసుకోవచ్చు. పెట్టుబడి కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఎలాంటి స్థలం అవసరం లేదు. మీరు సులభంగా ఇంట్లో ప్రారంభించి లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు.
ఆడవాళ్ళకి కూడా ఈ వ్యాపారం నీళ్ళు తాగినంత సులువు. అదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి అమ్మడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చు. దీనికి కావాల్సింది ఒక గ్రైండర్ మాత్రమే.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ కు పెద్ద రెస్టారెంట్లలో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రతి వంటకంలోనూ అల్లం వెల్లుల్లి పేస్టు తప్పనిసరిగా అవసరం. వంటకి ఉప్పు, కారం ఎంత ముఖ్యమో, వెల్లుల్లి పేస్టు ఉంటే రుచి బాగుంటుంది. ప్రతిరోజూ మార్కెట్‌కి వెళ్లి తాజా ఉల్లిపాయలు తీసుకొచ్చి పేస్ట్ చేసి ప్యాక్ చేసి డీలర్లకు విక్రయించవచ్చు.
దీనికి 3 నుంచి 5 లక్షల మూలధనం సరిపోతుంది. వ్యాపారం బాగుండాలంటే ముందుగా ఓపిక పట్టాలి. వ్యాపారం ప్రారంభించిన తొలిరోజే లక్ష లక్షలు కావాలంటే కష్టం. 6 నెలల తర్వాత మాత్రమే మీ వ్యాపారం ఏమి చేస్తుందో మీకు తెలుస్తుంది.
మీకు కావాల్సిందల్లా నమ్మకం. మీరు తయారు చేసిన వెల్లుల్లి పేస్టు శుభ్రంగా ఎలాంటి మోసం లేకుండా తయారు చేస్తే ఆటోమెటిగ్గా మీ వద్దే కొనుగోలు చేస్తారు. రెస్టారెంట్లే కాదు మీ చుట్టు పక్కల వారు కూడా మీ వద్దే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఇంట్లో ఉండే మహిళలు ఈ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు. మీరు నెలకు కనీసం 60,000 నుండి 70,000 వరకు సంపాదించవచ్చు.