Business Ideas: 40 రోజుల్లో లక్షలు సంపాదించే అవకాశం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. కిర్రాక్ బిజినెస్ ఐడియా భయ్యా ఇది

Business Ideas: కేవలం 40 రోజుల్లో లక్షలు సంపాదించే బిజినెస్ గురించి మీకు తెలుసా. అయితే ఈ స్టోరీ మీకోసమే. మీకు కూడా బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉంటే ఈ బిజినెస్ ఐడియా గురించి ఓసారి తెలుసుకోండి. ఎందుకంటే నేటి కాలంలో చాలా మందికి ఉద్యోగాలు చేసి బోర్ కొట్టింది. ఉన్నఊరిలోనే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారికి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ బిజినెస్. అదేంటో తెలుసుకుందాం. 
 

1 /7

Business Ideas: ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాపారంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తే వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. అలాని ఉద్యోగాలు మానుకోలేరు. అందుకే పార్ట్ టైం బిజినెస్ లు ప్రారంభిస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఉద్యోగాలు మానేసి బిజినెస్ లు ప్రారంభిస్తున్నారు. వ్యాపారం చేయాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఉన్నత చదువులు చదవాల్సిన అవసరం అసలే లేదు. కావాల్సిందల్లా కాస్తంత తెలివి..విషయ పరిజ్నానం. ఈ రెండు ఉన్నవాళ్లు బిజినెస్ లో రాణించడం పక్కా. 

2 /7

మీరు కూడా ఏదైనా చక్కటి బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తుంటే మీకోసం ఓ మంచి ఐడియాను తీసుకువచ్చాం. చాలా మందికి చికెన్ అంటే ఇష్టం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చికెన్ ఇష్టంగా తింటుంటారు. మరి చికెన్ కిలో మార్కెట్లో దాదాపు 250పైగానే ఉంది. గుడ్ల ధరలు కూడా కొండెక్కి కూర్చొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే పౌల్ట్రీ ఫాం ప్రారంభించవచ్చు. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువే. కావాలంటే ప్రభుత్వం లోన్స్ కూడా ఇస్తుంది. 

3 /7

కోళ్ల పెంపకం వ్యాపారం కేవలం 40-45 రోజుల్లోనే రూ.1 నుంచి 2 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించగలదు. ఈ వ్యాపారంలో మీరు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను సంపాదించవచ్చు. దీని కారణంగా, ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందింది.  

4 /7

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం ఒక అద్భుతమైన ఉపాధి వనరుగా మారుతోంది. ఈ బిజినెస్ చేయడం  ద్వారా రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. గత రెండేళ్లుగా కోళ్ల పెంపకంలో మంచి లాభాలు గడిస్తున్న రైతులు ఎంతో మంది ఉన్నారు.   

5 /7

కోళ్ల పెంపకంలో కోళ్లు, గుడ్ల విక్రయంతో రైతుకు రెట్టింపు లాభం వస్తుంది. చలికాలంలో గుడ్లకు డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా, కోళ్ల విక్రయం రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా మారుతుంది.

6 /7

కోళ్ల పెంపకం ప్రారంభించడానికి భారీగా పెట్టుబడి  అవసరం లేదు. 200 అడుగుల విస్తీర్ణంలో బహిరంగ, సురక్షితమైన స్థలంలో ఈ వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు. అదనంగా, కొన్ని కంపెనీలు కోడిపిల్లలను అందిస్తాయి. ఇది ప్రారంభ ధరను మరింత తగ్గిస్తుంది.  

7 /7

చాలా మంది రైతులు కోడిపిల్లలను పెంచడమే కాకుండా వాటిని సిద్ధం చేసి ఇతర రైతులకు విక్రయిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ వ్యాపారం తక్కువ ఖర్చుతో..వేగంగా వృద్ధి చెందడానికి రైతులలో ఆదర్శవంతమైన ఎంపికగా మారుతోంది.