Business Ideas: ఏ వ్యాపారం చేయాలన్నా ముందుగా రెండు అంశాలు చాలా ముఖ్యం అవి పెట్టుబడితోపాటు మార్కెట్ అవగాహన. వీటిని సరిగ్గా అంచనా వేయకుండా బిజినెస్ ప్రారంభిస్తే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఎదుర్కొవల్సి వస్తుంది. అందుకే మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సీజన్‌ను పట్టుకోవడం తెలివైన వ్యాపార నిర్ణయమని చెప్పవచ్చు. మరికొన్ని రోజుల్లో శీతాకాలం ప్రారంభం కాబోతోంది. ఈ సారి వర్షాలు భారీగా కురుస్తున్నాయి కాబట్టి చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో వెచ్చని దుస్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వింటర్ వేర్ లేదా ఉలెన్ క్లాత్ వ్యాపారం ప్రారంభించడం అత్యంత లాభదాయకమైన ఆలోచన అవుతుంది.
1/6ఈ వ్యాపారం ప్రత్యేకత ఏమిటంటే .. మహిళలు కూడా ఇంట్లో నుంచే సులభంగా ప్రారంభించవచ్చు. చలికాలం మొత్తం కేవలం రెండు నుంచి మూడు నెలల్లోనే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. జాకెట్లు, స్వెటర్లు, శాలువాలు, గ్లౌవ్స్, టోపీలు వంటి ఉత్పత్తులకు ఈ సమయంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మీరు నేరుగా కస్టమర్లకు రిటైల్‌గా అమ్మకాలు చేయవచ్చు లేదా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి హోల్‌సేల్ వ్యాపారం చేయవచ్చు. రెండింటి ద్వారా కూడా లాభాల అవకాశాలు బాగానే ఉంటాయి.
2/6మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. రాబోయే నెలల్లో వెచ్చని దుస్తుల డిమాండ్ మరింతగా పెరగనుంది. అందువల్ల కస్టమర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త డిజైన్‌లు, కలర్ కాంబినేషన్‌లతో ఉన్న దుస్తులను ఎంచుకోవడం ఉత్తమం. ప్రతీ సీజన్‌కు వేర్వేరు ఫ్యాషన్‌లు వస్తుంటాయి కాబట్టి మీ వద్ద వెరైటీ ఎక్కువగా ఉంటే అమ్మకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
3/6ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. మీరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడితో మొదలుపెట్టవచ్చు. పెద్ద స్థాయిలో చేయాలనుకుంటే రూ.5 నుండి రూ.7 లక్షల వరకు పెట్టుబడి పెట్టడం సరిపోతుంది. మీరు వెచ్చని బట్టలను పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ఉన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుండి నేరుగా ఆర్డర్ చేయవచ్చు. లేకపోతే మీ ప్రాంతంలోని హోల్‌సేలర్ల వద్ద నుంచీ కూడా సరుకులు తెప్పించవచ్చు.
4/6దుస్తులను నిల్వ చేసే ప్రదేశం తేమ లేని పొడిగా ఉండే స్థలంగా ఉండాలి. తేమ ఎక్కువగా ఉన్న చోట ఉన్ని దుస్తులు ఫంగస్ పట్టి పాడవుతాయి. అందువల్ల స్టోరేజ్ స్థలం కూడా వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తుంది.
5/6చలికాలం దుస్తువుల వ్యాపారంలో లాభం మీ కష్టం, మార్కెట్ ను అర్థం చేసుకోవడం, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ వ్యాపారంలో 30శాతం నుంచి 40శాతం వరకు లాభం సాధించవచ్చు. సీజన్‌లో కొద్ది నెలల వ్యవధిలోనే మంచి ఆదాయం వచ్చే ఈ వ్యాపారం, ప్రత్యేకంగా మహిళలకు లేదా చిన్న స్థాయిలో వ్యాపారం మొదలుపెట్టదలచిన వారికి అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు.
6/6మరి ఈ చలికాలాన్ని కేవలం చలిగా కాకుండా, ఆదాయం తెచ్చే సీజన్‌గా మార్చుకోవాలంటే వెంటనే వెచ్చని బట్టల వ్యాపారం ప్రారంభించండి.