Samsung Galaxy A36: రూ.10 వేల లోపే Samsung Galaxy A36 5G.. ఎగబడి కొంటున్న జనం!

Dharmaraju Dhurishetty | Updated On : Wed, 08 Apr 2026-1:40 pm, | Published on : | Wed, 08 Apr 2026-1:39 pm,

అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఎక్కువగా పెరగడంతో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి అత్యంత తక్కువ ధరకే మొబైల్ పొందవచ్చు. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి ఈ మొబైల్ కొనేవారికి.. చాలా చీప్ ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు. 

Samsung Galaxy A36 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇది 6.7 అంగుళాల Full HD+ Super AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీనికి Gorilla Glass Victus+  ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు Qualcomm Snapdragon 6 Gen 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.  

ఈ Samsung Galaxy A36 5G మొబైల్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా 50MP OISతో కూడిన ప్రధాన కెమెరా కూడా లభిస్తోంది. అలాగే అదనంగా 8MP అల్ట్రా వైడ్, 5MP మాక్రో కెమెరాలు కూడా లభించడం విశేషం. ఇక ఫ్రంట్ భాగంలో సెల్ఫీ కోసం 12MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీ సామర్థ్యం  కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా లభిస్తుంది.

ఈ Samsung Galaxy A36 5G మొబైల్ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 15 (One UI 7.0) పై పనిచేస్తుంది. సాంసంగ్ దీనికి ఆరేళ్లపాటు సాఫ్ట్వేర్ తో పాటు సెక్యూరిటీ అప్డేట్లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది IP67 రేటింగ్ (దుమ్ము, నీటి  నుంచి రక్షణ అందించేందుకు), ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్,  డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి.   

ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ ధర MRP రూ.35,999 కాగా.. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఏకంగా 10 శాతం ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.32,499కే పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.3,300 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.   

అంతేకాకుండా సాధారణ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.2 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇక ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ఇదే డిస్కౌంట్ లభిస్తుంది. ఇక దీనిపై ఎక్స్చేంజ్‌ బోనస్ ఆఫర్ ను వినియోగిస్తే రూ.22 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్ ను కేవలం రూ.10 వేల లోపే పొందవచ్చు..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link