Pattu Sarees For Low Cost : పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది .. ఇక అందరూ కూడా చీరలు, నగలు షాపింగ్ మొదలు పెట్టేస్తారు. పెళ్లికూతుర్లు మాత్రమే కాదు.. పెళ్లిళ్లకు పోయే వాళ్లకు కూడా ప్రస్తుతం ఎన్నో చీరలు కావాలి.. ఎందుకంటే నవంబర్ నెలలో అత్యధికంగా.. తెలుగు రాష్ట్రాలలో పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి..
1/5నవంబర్ నెల అనగానే.. పెళ్లిళ్ల సీజన్ మొదలైనట్టే లెక్క. సంవత్సరంలో నవంబర్ నెల జరిగినన్ని పెళ్లిళ్లు.. తెలుగు రాష్ట్రాలలో మరే నెల జరగవు. పెళ్లి మండపాల దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ వరకు.. ఈ నెల మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది.
2/5ముఖ్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళకే కాకుండా.. పెళ్లిళ్లకు వెళ్లే వాళ్లకి కూడా ప్రస్తుతం.. ఎన్నో చీరలు కొనడం ఎంతో అవసరం. నవంబర్ నెలలో ప్రతి ఒక్కరూ కనీసం మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లు.. వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఈ పెళ్లిళ్లకు చీరలు కొనడం కూడా ఎంతో ముఖ్యం.
3/5మరో పక్క ప్రతి పెళ్లికి.. పట్టుచీర.. కట్టుకోవాలి అని తాపత్రేయ పడుతూ ఉంటారు అమ్మాయి. అయితే పట్టుచీర అనగా.. కనీసం 15000 అయిపోతుంది. అయితే ప్రతి పెళ్లికి ఇంత ధర పెట్టి కొనాలి అంటే అది అసాధ్యమే. మరో పక్క కట్టిన చీర కట్ట కూడదు అనేది కూడా ఎంతోమంది అభిప్రాయం.
4/5మీకు ఇలాంటి సమస్య ఉంటే.. ఇప్పుడు చెప్పబోయే చిట్కా మీకు ఎంతగానో పనికి వస్తుంది. అదేమిటి అంటే.. ప్రస్తుతం సికోపట్టు.. మైసూర్ సిల్క్ పట్టు.. లాంటివి దివాలి ఆఫర్స్ కింద షాపింగ్ మాల్స్.. వన్ ప్లస్ వన్ ఆఫర్ కు వస్తున్నాయి.
5/5కంచి పెరుమాళ్ షాపులతో పాటు.. ఎలాంటి పట్టు చీర దొరికే షాపులకు వెళ్లిన.. సీకో పట్టు చీరలు.. లేదా హ్యాండ్లూమ్ పట్టు చీరలు.. అని అడిగి చూడండి.. 15వేల చీరలు ఇచ్చే లుక్.. మీకు కేవలం 3000 నుంచి 5000 లోపల దొరికే ఈ చీరలు కూడా ఇస్తాయి. అంతేకాదు ఈ చీరలు ఎంతో పద్ధతిగా కూడా ఉంటాయి.