E-Passport: కొత్త ఇ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చా? అప్లై మీ నగరంలో అందుబాటులో ఉందా?

E-Passport Apply Availability: కొత్తగా మన దేశంలో ఇ పాస్‌పోర్ట్ విధానం అందుబాటులో వచ్చింది. విదేశీ ప్రయాణం చేయాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్‌ ఉండాల్సిందే. అయితే, సాంప్రదాయ పాస్‌పోర్ట్‌కు అప్డేటెడ్‌గా ఇ పాస్‌పోర్ట్ వచ్చేసింది. స్మార్ట్‌ వర్క్‌తో వెరిఫికేషన్‌ ఆలస్యం కాకుండా ఈజీగా ప్రయాణం చేయవచ్చు. అయితే, ఇ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే విధానం తెలుసుకుందాం
 

1 /7

పాస్‌పోర్ట్‌ సేవా ప్రోగ్రామ్‌ 2.0 లో భాగంగా భారత ప్రభుత్వం ఇ పాస్‌పోర్ట్‌ ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. విదేశీ మంత్రిత్వ శాఖ ఇ పాస్‌పోర్ట్‌ విధానాన్ని 2024 ఏప్రిల్‌ 1న పైలట్‌ ఫేజ్‌ ప్రారంభించారు. దీని ద్వారా కొన్ని మిలీయన్‌ల భారతీయ ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విదేశాలకు ట్రావెల్‌ చేయవచ్చు.  

2 /7

ఇ పాస్‌పోర్ట్‌ కూడా చూడటానికి మన సాధారణ పాస్‌పోర్ట్ మాదిరి ఉంటుంది. కానీ, వెనుక వైపు చిన్న ఎలక్ట్రానిక్‌ చిప్‌ అమర్చుతారు. ఈ చిప్‌లో మన వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్‌ వివరాలు భద్రంగా ఉంటాయి. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా దుర్వినయోగం కాకుండా ఇది రక్షణ ఇస్తుంది.  

3 /7

మోడ్రన్‌ టెక్నాలజీతో ఇ పాస్‌పోర్ట్‌ తయారు చేశారు. వెరిఫికేషన్‌ త్వరగా, భద్రంగా జరుగుతుంది. ఈ చిప్‌లో మీ ఐరీస్‌, ఫింగర్‌ప్రింట్స్‌, ఫోటోగ్రాఫ్‌ కూడా ఉంటాయి. ఇది డూప్లికేట్‌ పాస్‌పోర్ట్‌కు చెక్‌ పెడుతుంది. ఈ పాస్‌పోర్ట్ జారీ చేసిన అధికారి డిజిటల్‌ సిగ్నేచర్‌ కూడా ఉంటుంది  

4 /7

ఈ పాస్‌పోర్ట్‌ చిప్‌లో యూనిక్‌ పాస్‌పోర్ట్‌ నెంబర్‌, జారీ చేసిన తేదీ, ఎక్స్‌పైరీ వివరాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ఇ పాస్‌పోర్ట్‌ అందుబాటులో ఉంది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌, కోల్‌కత్త, గువాహటీ, లక్నో, కొచ్చీ, ఛండీగఢ్‌.  

5 /7

అయితే, ఇ పాస్‌పోర్ట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోలేము. ఎందుకంటే దీనికి చిప్‌ అమర్చి ఉంటుంది కాబట్టి ఫిజికల్‌ కార్డు తప్పనిసరి. మీరు ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌ స్టేటస్‌ చెక్ చేసుకోవచ్చు.  

6 /7

ముందుగా పాస్‌పోర్ట్‌ సేవ స్టేటస్‌ ట్రాకర్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి. ఆ తర్వాత ఫైల్‌ నెంబర్‌, పుట్టినతేదీ ఎంటర్‌ చేయాలి. అక్కడ మీ పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌కు సంబంధించిన తాజా వివరాలు ఉంటాయి.   

7 /7

ఇ పాస్‌పోర్ట్‌ చిప్‌ను RFID చిప్‌ అని పిలుస్తారు. పై కవర్‌లో గోల్డ్‌ సింబల్‌ ప్రింట్ అయి ఉంటుంది. ఈ చిప్‌లో ఉన్న వివరాలు మార్పు చేయడానికి ఉండదు. రెగ్యులర్‌ పాస్‌పోర్ట్‌ మాదిరి దీని వ్యాలిడిటీ కూడా ఉంటుంది. మైనర్స్‌కు 5 ఏళ్లు, పెద్దవారికి 10 ఏళ్లు.