Add Zee Business As A Preferred Source
App

New Cars in India: భారత్‌లో లాంఛ్ అయిన 7 కొత్త కార్లు..ఎంత ఖర్చు అవుతుందంటే?

Written ByHarish Darla
Published: Sep 06, 2025, 05:11 PM IST|Updated: Sep 06, 2025, 05:11 PM IST

Car Launches in 2025: దసరా పండుగకి ముందే భారత్‌లో కార్ల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే గత నెలలో (ఆగస్టు) 7 కార్ల వేరియంట్లు భారత మార్కెట్లోకి విడుదల అయ్యాయి. దసరా పండుగ నేపథ్యంలో కార్ల కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి తమ కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఆగస్టు నెలలో మొత్తం 7 కొత్త కార్లను విడుదల చేశారు. దేశీయ కార్ల కంపెనీ మహీంద్రా తన ఎలక్ట్రిక్ SUV BE 6, కొత్త బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే 999 యూనిట్ల ఈ పరిమిత ఎడిషన్ రెండున్నర నిమిషాల కంటే తక్కువ సమయంలో బుకింగ్ అయ్యాయి. గత నెలలో లాంచ్ అయిన 7 కార్లు ఏమిటో తెలుసుకుందాం.

Mahindra Thar Roxx1/5

మారుతి సుజుకి: ఆగస్టులో మారుతి తన ఫేమస్ మిడ్-సైజ్ SUV గ్రాండ్ విటారా, కొత్త ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది నలుపు రంగులో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ప్రత్యేకమైన మ్యాట్ బ్లాక్ రంగులో వచ్చే ఈ SUV, ఫీచర్ల పరంగా కూడా గొప్ప డిజైన్‌తో అలరిస్తుంది. ప్రస్తుతం గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.42 లక్షల నుండి రూ. 20.68 లక్షల వరకు ఉంది.    

Upcoming Cars 20252/5

మహీంద్రా: గత నెలలో మహీంద్రా కంపెనీ తమ ఎలక్ట్రిక్ SUV BE 6 న్యూ ఎడిషన్ రన్ బ్యాట్‌మ్యాన్ వేరియంట్ విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 27.79 లక్షలుగా ఉంది. BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ అద్భుతంగా డిజైన్ చేశారు. దీని 999 యూనిట్లు కేవలం 135 సెకన్లలో బుక్ అయ్యాయి.

Car launches August 20253/5

రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ కురో: ఆగస్టులో రెనాల్ట్ ఇండియా తన సరసమైన SUV కిగర్ కొత్త తరం మోడల్‌ను విడుదల చేసింది. 2025 రెనాల్ట్ కిగర్ ఇప్పుడు లుక్స్, ఫీచర్ల పరంగా చాలా మెరుగ్గా కనిపిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.30 లక్షల నుండి ప్రారంభమై రూ. 11.30 లక్షల వరకు ఉంటుంది. గత నెలలో నిస్సాన్ ఇండియా, నిస్సాన్ మాగ్నైట్ కురో వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.31 లక్షల నుండి ప్రారంభమై రూ. 10.87 లక్షల వరకు ఉంటుంది. మాగ్నైట్ కురో వెర్షన్ లుక్స్, ఫీచర్ల పరంగా మిగిలిన వేరియంట్‌ల కంటే మెరుగ్గా ఉంటుంది.

Upcoming Cars4/5

సిట్రోయెన్ ఇండియా గత ఏడాది ఆగస్టులో తన హ్యాచ్‌బ్యాక్ C3 ప్రీమియం వేరియంట్ అయిన సిట్రోయెన్ C3 X స్పోర్టీని విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.91 లక్షల నుండి రూ. 9.90 లక్షల వరకు ఉంటుంది.    

auto news5/5

టయోటా, మెర్సిడెస్ నుండి కొత్త కార్లు: ఆగస్టు 2025లో టయోటా కిర్లోస్కర్ మోటార్ తన క్యామ్రీ స్పోర్టీ ఎడిషన్, క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 48.50 లక్షలు. మెర్సిడెస్ ఇండియా తన కొత్త కారు మెర్సిడెస్-AMG CLE 53ని కూడా విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.35 కోట్లుగా ఉంది.