Pragati Scholarship: కేంద్ర ప్రభుత్వం వారి బాలికల ఉన్నత విద్య కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో అత్యంత ముఖ్యమైనది AICTE ప్రగతి స్కాలర్‌షిప్ (Pragati Scholarship). ఈ స్కీం ప్రధానంగా బాలికల్లో ఇంజనీరింగ్ విద్య చదివేవారిని ప్రోత్సహించడానికి ఉద్దేశించి రూపొందించారు.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఈ స్కాలర్షిప్ స్కీమ్ నిర్వహిస్తోంది. ఈ స్కాలర్షిప్ పథకం కేవలం బాలికలను ఉద్దేశించింది మాత్రమే. సంవత్సరానికి 8 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన బాలికలు అప్లై చేసుకోవచ్చు.
AICTE గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ కోర్సుల మొదటి సంవత్సరం లేదా లాటరల్ ఎంట్రీ ద్వారా రెండవ సంవత్సరం చేరిన విద్యార్థినులు ఈ స్కీం కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు.
ఒక కుటుంబానికి గరిష్టంగా ఇద్దరు బాలికలు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. ప్రతి సంవత్సరం రూ. 50,000 స్కాలర్ షిప్ కోసం అందిస్తారు. ఈ మొత్తం కళాశాల ఫీజు, కంప్యూటర్ కొనుగోలు, స్టేషనరీ, పుస్తకాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లు వంటి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. అయితే హాస్టల్ వసతి కోసం ఈ మొత్తం ఉపయోగించకూడదు.
మొదటి సంవత్సరం చేరిన విద్యార్థినులకు గరిష్టంగా 4 సంవత్సరాలు; లాటరల్ ఎంట్రీ ద్వారా చేరిన వారికి గరిష్టంగా 3 సంవత్సరాలు. ఈ స్కాల్ షిప్ లభిస్తుంది. పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులు చదివే విద్యార్థినులకు కూడా మొదటి సంవత్సరం నుంచి స్కాలర్షిప్ అందిస్తారు.
ఈ స్కాలర్షిప్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు, 10, 12 తరగతులకు చెందిన మార్కుల షీట్స్ తో పాటు అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం : https://www.aicte-india.org/schemes/students-development-schemes/Pragati/General-Instructions ఈ వెబ్సైట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం కేవలం బాలికలను ప్రోత్సహించడానికి ఇంజనీరింగ్ విద్యలో వారికి ఆర్థికంగా సహాయపడడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని తరగతులకు చెందిన బాలికలు ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.