Gratuity Limit Hiked to Defence Personnel: కేంద్ర ప్రభుత్వంలో నిర్దిష్ట విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వేతన సవరణకు సంబంధించిన ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం త్వరలోనే ముగియనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 01.01.2016న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన లేదా మరణించిన కమిషన్డ్ ఆఫీసర్లు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, ఇతర ర్యాంకులకు సవరించిన పరిమితి అమలు చేసింది. మే 14, 2025న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. సవరించిన పరిమితి అన్ని రకాల గ్రాట్యుటీలకు వర్తిస్తుంది.
డీఏను బేసిక్ పేలో 50 శాతానికి పెంచిన తరువాత.. పదవీ విరమణ చేసే రక్షణ సిబ్బందికి భారీ ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాల గ్రాట్యుటీల గరిష్ట పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచింది.
7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ సవరణ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ 50 శాతం పరిమితిని దాటిన తర్వాత గ్రాట్యుటీ పరిమితిలో 25 శాతం పెంపును 7వ వేతన సంఘం సిఫార్సు చేసింది.
జనవరి 1, 2024 నుంచి డీఏ 50 శాతానికి చేరిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా పెంచిన గ్రాట్యుటీ కూడా ఆ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. మే 14, 2025న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. సవరించిన పరిమితి అన్ని రకాల గ్రాట్యుటీలకు వర్తిస్తుంది.
పదవీ విరమణ గ్రాట్యుటీ, సర్వీస్ గ్రాట్యుటీ, చెల్లని గ్రాట్యుటీ, ప్రత్యేక గ్రాట్యుటీ, టెర్మినల్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ ఇలా అన్ని రకాల గ్రాట్యుటీలకు వర్తించనుంది.
7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం.. 01.01.2016న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన లేదా మరణించిన కమిషన్డ్ ఆఫీసర్లు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, ఇతర ర్యాంకులకు సవరించిన పరిమితి అమలు చేయనుంది.
ప్రారంభంలో గ్రాట్యుటీని రూ.20 లక్షలుగా ఉండగా.. గతేడాది జనవరి 1 నుంచి అమలు చేసిన డీఏ 50 శాతానికి చేరడంతో తాజాగా 7వ వేతన సంఘం సెక్షన్ 7.1 ప్రకారం గ్రాట్యుటీ పరిమితుల పెంపును అధికారికంగా ప్రకటన చేసింది.
సవరించిన గ్రాట్యుటీ రూ.25 లక్షలకు చేరింది. జనవరి 1, 2024 నుంచి వర్తింపజేయనున్నారు. 01.01.2016న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన లేదా మరణించిన రక్షణ సిబ్బంది కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.