Add Zee Business As A Preferred Source
App

Free Laptop For Students: విద్యార్థులకు మోదీ సర్కారు ఉచిత లాప్ టాప్ పథకం.!. అసలు నిజం ఏంటంటే..?

Written ByInamdar Paresh
Published: Sep 03, 2025, 04:46 PM IST|Updated: Sep 03, 2025, 04:51 PM IST

Central govt free laptop scheme: గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత లాప్ టాప్ ను ఇచ్చే పథకంను అమలు చేయనుందని, దీనిపై అన్నిరకాలుగా ముందకు వెళ్తుందని కూడా వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే.. దీనిపై తాజాగా.. అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు.
 

modi govt:1/6

మోదీ సర్కారు:

ప్రస్తుతం సోషల్ మీడియాలో అసలైన వార్తల కంటే.. రూమర్స్ లు, ఫెక్ వార్తలు జెట్ స్పీడ్ లో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు..  విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు ఇచ్చే పథకం తీసుకొస్తుందని ప్రచారం జరుగుతుంది. 

free laptops:2/6

ఉచిత ల్యాప్ టాప్ పథకం:

 అంతేకాకుండా క్యాబినెట్ కూడా దీనిపై చర్చించిందని, నిధులు కూడా ఈ కొత్త పథకం కోసం విడుదలయ్యాయని సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై తాజాగా... అధికారులు క్లారిటీ ఇచ్చారు.   

central govt:3/6

కేంద్ర ప్రభుత్వం:

లాప్‌టాప్ స్కీమ్ ఫర్ స్టూడెంట్స్ 2025 అనే వార్త వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం అవుతోందని, దీన్ని నమ్మవద్దని కేంద్రం కోరింది. ఇదంతా కల్పితమైన వార్తలు అంటూ.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB),  ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) వంటి ప్రభుత్వ సంస్థలు ఒక ప్రటకన విడుదల చేశాయి.  

free laptops for students:4/6

ఉచిత ల్యాప్ టాప్ లు:

కొంత  మంది కావాలని, స్టూడెంట్ లాప్‌టాప్ స్కీమ్ 2025 పేరుతో విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నట్లు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని, ముఖ్యంగా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఉద్దేశ్యంతో ఇలాంటి సందేశాలు వ్యాప్తి చేయబడతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

pm modi:5/6

పీఎం మోదీ:

ఈ విధంగా వచ్చే వార్తల లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా లేదా మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవడం ద్వారా, మీరు ఆర్థిక మోసాలలో చిక్కుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే..  కేంద్ర ప్రభుత్వం పేరుతో అలాంటి పథకం లేకపోయినా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించే పథకాలను అమలు చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు .  

tamil nadu:6/6

తమిళనాడు:

గతంలో తమిళనాడులో ఉచిత లాప్ టాప్ పథకంను అమలు చేశారన్నారు. జయలలిత సీఎంగా ఉన్న సమయంలో.. ల్యాప్ టాప్ లు స్టూడెంట్స్ కు అందజేశారని, మరల ఆ పథకంను అమలు చేసే దిశగా స్టాలీన్ సర్కారు ముందుకు వెళ్తుందని అధికారులు తెలిపారు. కానీ కేంద్రం మాత్రం ల్యాప్ టాప్ లను ఇవ్వడంలేదని అధికారులు ఒక స్పష్టత నిచ్చారు.  దీంతో ఈ రూమర్స్ కు మాత్రం చెక్ పడిందని చెప్పుకోవచ్చు.