Lunar Eclipse effect 2025: అత్యంత శక్తివంతమైన రాహుగ్రస్త చంద్ర గ్రహణం సెప్టెంబర్ 7న ఆదివారం ఏర్పడబొతుంది. ఈ రోజున కొన్ని జాగ్రత్తలు పాటించడంతో పాటుగా కొన్ని నియమాల్ని తప్పకుండా పాటించాలి. అంతే కాకుండా గ్రహణం మరుసటి రోజున కొన్ని దానాలు పండితులకు ఇస్తే మరింత యోగ్యమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
1/6సాధారణంగా సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలు అత్యంత అరుదుగా ఏర్పడతాయి. అయితే.. రాహు, కేతువుల ప్రభావం వల్ల ఈగ్రహనాలు సంభవిస్తాయి. అయితే ప్రస్తుతం మనం సెప్టెంబర్ 7న రాహుగ్రస్త చంద్ర గ్రహణంను ఏర్పడటం చూడబోతున్నాం. అయితే.. దీని ప్రభావం అనేది ద్వాదశ రాశులపై ఉండనుంది.
2/6ముఖ్యంగా..సెప్టెంబర్ 7, ఆదివారం రోజు.. భాద్రపద పౌర్ణమి వేళ రాహుగ్రస్థ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. శతభిషము, పూర్వాభాద్ర నక్షత్రాలలో.. కుంభరాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
3/6స్పర్శం (ప్రారంభం) రాత్రి 9:57, మధ్యకాలం.. రాత్రి 11:41, విడుపు ప్రారంభం.. రాత్రి 12:22 (8వ తేదీ) ముగింపు.. ఉదయం 1:26 (8వ తేదీ)అని పండితులు చెబుతున్నారు. మొత్తంగా గ్రహనం.. 3 గంటలు 30 నిమిషాలు గ్రహణం ప్రభావం ఉండనుంది.
4/6రాహుగ్రస్త చంద్రగ్రహణం.. వృషభ, మిథున, సింహ, కన్య, తుల, మకర, కుంభ, మీన వారికి ప్రతికూల ప్రభావాల్ని చూపిస్తుంది. మేష, కర్కాటక, వృశ్చిక, ధనుస్సు.. వీరికి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. ఈ క్రమంలో చెడు ఫలితాలు ఉన్న రాశుల వారు సెప్టెంబర్ 8న కొన్ని దోష పరిహరాల్ని పాటించాలి.
5/6అదే విధంగా గ్రహణసమయంలో రాత్రిపూట శక్తి కోలది దేవతా అర్చనలు, పూజలు చేయాలి. గ్రహణం కాలంలో వీలైతే నదీస్నానం, మంత్రజపం చేయాలి. ఈ సమయంలో చేసే దానాలు, పూజలు , వ్రతాలు వెయ్యిరెట్లు గొప్ప ఫలితాల్ని ఇస్తాయి. మరుసటి రోజు తమకు ఇష్టమైన దేవుడి ఆలయంకు వెళ్లి సంకల్పం, పూజలు, అర్చనలు, అభిషేకం చేయించుకోవాలి. కింద ఇచ్చిన విధంగా దానాలు ఇవ్వాలి.
6/6ముఖ్యంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి.. చంద్రుడు మనస్సుకు కారకుడు. అందుకే ఈ సమయంలో మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. అందుకే ఈ దోషంను పొగొట్టుటకు.. కేజీన్నర బియ్యం, ఒకకేజీ చక్కెర, పాలు,పెరుగు ప్యాకెట్లు, కంచులో నెయ్యిదీపం, వెండి చిన్నది చంద్రుడి ప్రతిమ, రాహుకు గుర్తుగా పాము పడగ ఉన్నది వెండి ప్రతిమ, కొత్త ధోతి, ఉత్తరీయం, తోచిన సంభావనలు పెద్ద పాత్రలో పెట్టి గుడికి తీసుకెళ్లి పండితుడితో సంకల్పం చెప్పించుకుని మరీ దానం ఇవ్వాలి.