Chandrababu Diet Plan: ఏపీ సీఎం చంద్రబాబు డైట్ సీక్రెట్ ఇదే.. అందుకే 75 ఏళ్ల వయసులోనూ ఎనర్జీతో ఉరకలేస్తున్నారు.. మీరూ ఫాలో అవ్వండి..!!

Chandrababu Fitness Secrets: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పాదయాత్రలు, రాష్ట్ర పర్యటనలు, సభలు.. ఇవన్నీ ఆయనకు సాధారణ విషయాలే. వయస్సుతో సంబంధం లేకుండా ఈ స్థాయిలో చురుకుగా ఉండటానికి కారణం ఆయన మితాహార జీవనశైలి. క్రమశిక్షణతో కూడిన డైట్ ప్లాన్ అని చెప్పవచ్చు.

1 /6

చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. నేను బతకడానికి తింటాను, తినడం కోసం బతకను. అంటే ఆయన ఆహారాన్ని శరీరానికి అవసరమైన ఇంధనంగా మాత్రమే తీసుకుంటారు, రుచుల కోసం కాదు. ప్రతిరోజూ తినే ఆహారంలో ఎంత కేలరీలున్నాయో, వ్యాయామంతో ఎన్ని కేలరీలు కరిగిపోతున్నాయో లెక్క వేసుకుంటారు. ఇదే ఆయన ఆరోగ్య రహస్యం.

2 /6

ఉదయాన్నే ఇడ్లీ, జొన్న ఇడ్లీ లేదా ఓట్స్ ఉప్మా, రెండు దోశలు, కొద్దిగా చట్నీ, రెండు ఎగ్ వైట్స్ తింటారు. మధ్యాహ్నానికి ముందు ఒక చిన్న పండు తీసుకుంటారు.

3 /6

 భోజన సమయానికి రాగి, జొన్న లేదా సజ్జ రొట్టెలు, రెండు లేదా మూడు వెజిటేబుల్ కూరలు, కొద్దిగా పెరుగు తింటారు.    

4 /6

  లంచ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆయన అలవాటు. సాయంత్రం సూప్, స్నాక్స్, ఎగ్ వైట్ తీసుకుంటారు. రాత్రి భోజనానికి ఒక గ్లాసు పాలు మాత్రమే తీసుకుంటారు. మరీ ఆకలి వేస్తే ఒక చిన్న పండు తీసుకుంటారు. రోజూ కేవలం ఆరు గంటలపాటు నిద్రపోతారు.  

5 /6

ఆయన ఆహారపు అలవాట్లు, వ్యాయామ పద్ధతులు పూర్తిగా శాస్త్రీయంగా ఉంటాయి. ఏది శరీరానికి అవసరం, ఏది మానుకోవాలో బాగా తెలుసుకుని తన జీవనశైలిని మార్చుకున్నారు.

6 /6

    ఇప్పుడు యువతకు కూడా చంద్రబాబు డైట్ ప్లాన్ స్ఫూర్తిదాయకంగా మారింది. ఫ్యాన్సీ డైట్స్ లేదా జిమ్‌పై ఆధారపడకుండా మితాహారం, సమతుల్య పోషకాహారం, క్రమమైన వ్యాయామం ఉంటే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండవచ్చని ఆయన జీవితం చెబుతోంది. చంద్రబాబు చూపిస్తున్న మార్గం స్పష్టంగా చెప్పేది డిసిప్లిన్ ఈజ్ ది కీ టు ఫిట్నెస్.