Add Zee Business As A Preferred Source
App

Chandrababu naidu Govt: దసరా వేళ చంద్రబాబు బంపర్ శుభవార్త.. ఏపీలో విద్యుత్ చార్జీలు భారీగా తగ్గింపు.. డిటెయిల్స్...

Written ByInamdar Paresh
Published: Sep 28, 2025, 01:43 PM IST|Updated: Sep 28, 2025, 01:48 PM IST

Chandrababu naidu on Electricity charges:  చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ ప్రజలకు దసరా వేళ భారీ శుభవార్త చెప్పింది. గత  సర్కారు ట్రూ అప్ పేరుతో వసూలు చేసిన సుమారు 923.55 కోట్లను తమ సర్కారు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
 

Andhra pradesh:1/5

కూటమి ప్రభుత్వం:

దేశ మంతట కూడా ఎక్కడ చూసిన దసరా నవరాత్రుల శోభ కన్పిస్తుంది. ముఖ్యంగా దసరా నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు హలీడే ప్రకటించడంతో చాలా మంది తమ సొంతూళ్ల బాట పట్టారు. ఈ క్రమంలో  ఏపీలో మహిళలకు ఇప్పటికే చంద్రబాబు రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులలో కూడా ఉచిత బస్సు ప్రయాణం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

apspdcl:2/5

ఏపీ ఎస్పీడీసీఎల్:

ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలలో.. ట్రూఅప్ పేరుతో  వసూలు చేసిన సుమారు 923.55 కోట్లను ప్రస్తుతం మినహాయించనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో విద్యుత్ చార్జీల్ని తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.  

ap electricity:3/5

ఏపీ ప్రభుత్వం:

 నవంబర్ నెల నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు విద్యుత్ బిల్లుల భారం తగ్గనుంది.  గత ఐదేళ్లలో ట్రూఅప్‌ పేరుతో విద్యుత్ ఛార్జీల బాదుడే తెలిసిన వినియోగదారులకు కూటమి ప్రభుత్వం ట్రూడౌన్ (ఛార్జీల తగ్గింపు) ను వర్తింప చేస్తోందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.   

chandrababu naidu:4/5

ఏపీ విద్యుత్ చార్జీలు:

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిస్కంలు రూ.2,758.76 కోట్లకు ట్రూఅప్‌ కోసం దాఖలు చేయగా ఏపీఈఆర్‌సీ మాత్రం రూ.1,863.64 కోట్లకే ఆమోదం తెలిపింది.  ముఖ్యంగా.. డిస్కంలు వినియోగదారుల నుంచి రూ. 2,787 కోట్లు వసూలు చేశాయి. దీంతో ఆ మొత్తం నుంచి రూ. 1,863.64 కోట్లను తగ్గించి మిగతా రూ. 923.55 కోట్లను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది.   

electricity reduced in ap:5/5

చంద్రబాబు నాయుడు:

ఈ చార్జీల మొత్తాన్ని ట్రూడౌన్‌ ఛార్జీల రూపంలో నవంబర్ నుంచి వచ్చే ఏడాది అనగా 2026 అక్టోబర్ వచ్చే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయనున్నాయని అధకారులు వెల్లడించారు.. దీని వల్ల యూనిట్‌కు 13 పైసలు చొప్పున వినియోగదారులకు భారీగా లబ్ధి చేకూరనుందని అధికారులు క్లారీటీ ఇచ్చారు. దసరాకు ముందే కూటమి ప్రభుత్వం భారీశుభవార్త చెప్పిందని ప్రజలు పండగ చేసుకుంటున్నారు.