Add Zee Business As A Preferred Source
App

Chaturgrahi Yogam: త్వరలో అద్భుతమైన చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..

Written ByTA Kiran Kumar
Published: Sep 04, 2025, 05:19 AM IST|Updated: Sep 04, 2025, 05:20 AM IST

Chaturgrahi Yogam Effect: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికతో మంచి యోగాలు ఏర్పడుతాయి. అలాంటి యోగాల్లో చతుర్గ్రాహి యోగం ఒకటి. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక స్థానం నుంచి మరొక స్థానంలోకి మారుతుంటాయి. దీని ద్వారా, అనేక ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. అటువంటి శుభ యోగమే చతుర్గ్రహి యోగం.

Chaturgrahi Yogam Effect1/5

చతుర్గ్రాహి యోగం

Chaturgrahi Yogam Effect: సంపదకు మూలమైన శుక్రుడు సెప్టెంబర్ 15న సింహరాశిలోకి ప్రవేశించున్నాడు. ఈ టైమ్ తో  సూర్యుడు, బుధుడు, కేతువులతో కలిసి సింహరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. చతుర్గ్రహి యోగం వలన కొన్ని రాశుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు ఉండబోతున్నాయి. అంతేకాదు వీరు ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో అపారమైన గౌరవం పెరుగుతుంది.

Karkataka Rasi 2/5

కర్కాటక రాశి

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి చతుర్గ్రాహి యోగం వలన  ఆకస్మిక లాభాలు అందుకుంటారు. వ్యాపారవేత్తలు  కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభదాయక అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పెట్టుబడి వలన అనేక లాభాలను అందుకుంటారు. మీరు మాటల వలన ప్రజలను ఆకర్షిస్తారు.

Vrushchika Rasi3/5

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి: కెరీర్ పరంగా వ్యాపారంలో వృశ్చిక రాశి వారు మంచి  పురోగతి సాధిస్తారు. చతుర్గ్రాహి యోగం వలన  కొత్త బాధ్యతలు భుజాలపై పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కొత్త అవకాశాలు వస్తాయి. వ్యవస్థాపకులకు ఆర్థిక లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు ఇదే మంచి అవకాశాలు లభించనున్నాయి. 

Mesha Rasi 4/5

మేష రాశి

మేష రాశి: చతుర్గ్రాహి యోగం వలన  పిల్లలకు సంబంధించిన కొన్ని  శుభవార్తలు వింటారు. మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. 

Disclaimer5/5

గమనిక

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం పంచాంగాలు, హిందూ మత గ్రంథాల ఆధారంగా ఇవ్వబడింది. ఇది ఖచ్చితమైన సమాచారమే. ఇది హిందూ ధార్మిక  మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.