Add Zee Business As A Preferred Source
App

Chennai Super Kings: ఈ ఐదుగురు ఆటగాళ్లకు చెన్నై టాటా గుడ్‌బై.. సీఎస్‌కే సంచలన నిర్ణయం..!

Published: Apr 26, 2025, 03:59 PM IST|Updated: Apr 26, 2025, 03:59 PM IST

Chennai Super Kings Playoff Chances: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటతీరు ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు, నాలుగు పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. మిగిలిన ఐదు మ్యాచ్‌లు గెలిచినా.. టాప్-4 నిలవాలంటే ఎన్నో సమీకరణాలు కలిసి రావాలి. ప్రస్తుతం చెన్నై ఆటతీరు చూస్తుంటే అది అసాధ్యమే అనిపిస్తోంది. వచ్చే సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌ ఐదుగురు ప్లేయర్లను వదులుకునే అవకాశం కనిపిస్తోంది. వాళ్లు ఎవరంటే..?
 

Chennai Super Kings Playoff Chances1/5

ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడగా.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో కేవలం 21 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వచ్చే సీజన్‌కు సామ్ కర్రాన్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేసే ఛాన్స్‌ ఉంది.  

Chennai Super Kings2/5

గత సీజన్లలో మెరుపు ఆరంభాలు ఇచ్చిన డెవాన్ కాన్వే ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. వచ్చే సీజన్‌కు కాన్వేకు ఉద్వాసన పలికే అవకాశం ఉంది.  

IPL 20253/5

మిడిల్ ఆర్డర్‌లో కీలకంగా మారతాడని విజయ్ శంకర్‌ను సీఎస్‌కే వేలంలో కొనుగోలు చేయగా.. ఆశించిన స్థాయిలో రాణించలేదు. వచ్చే సీజన్‌కు టీమ్‌ నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది.   

Ms Dhoni Retirement4/5

అజింక్యా రహానే స్థానంలో చెన్నై జట్టు రాహుల్ త్రిపాఠిని చెన్నై టీమ్ కొనుగోలు చేసింది. అయితే ఓపెనింగ్‌లో వస్తున్న రాహుల్ త్రిపాఠి దారుణంగా విఫలమయ్యడు. CSK అతన్ని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది.  

IPL 2025 Latest News5/5

స్టార్ స్పిన్నర్ రవీచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో తేలిపోతున్నాడు. రూ.9.75 కోట్ల భారీ ధర వెచ్చించి వేలంలో తీసుకుంది సీఎస్‌కే. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. ముఖ్యంగా స్పిన్‌కు సహకరించే చెన్నై పిచ్‌పై కూడా అశ్విన్ రాణించలేకపోయాడు. వచ్చే సీజన్‌కు వేలంలోకి రిలీజ్‌ చేసి తక్కువ ధరకు దక్కించుకునే ప్లాన్ చేయవచ్చు.