CSK Released Players List: ఊహించని నిర్ణయం తీసుకున్న CSK.. సూపర్ హిట్టర్స్‌కు టాటా గుడ్‌ బై..!

Chennai Super Kings Retention List: IPL 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ సిద్ధమైంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతోపాటు సామ్ కర్రాన్‌ను రాజస్థాన్‌కు ఇచ్చిన చెన్నై.. ఆ టీమ్‌ నుంచి సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకుంది. ఎంఎస్‌ ధోనీ మరో సీజన్‌ కూడా ఆడనున్నాడు. టీమ్‌లో ఎవరు ఉన్నారు..? ఎవరిని రిటైన్ చేసుకున్నారు..? పూర్తి వివరాలు ఇలా..
 

1 /6

గత కొద్ది రోజులుగా క్రికెట్‌లో ఎక్కువగా సంజూ శాంసన్‌-రవీంద్ర జడేజా ట్రేడింగ్ చర్చ జరిగింది. అభిమానుల టెన్షన్‌కు తెర దించుతూ.. ఇవాళ అధికారిక ప్రకటన వచ్చేసింది. రూ.14 కోట్లకు జడేజాను రాజస్థాన్‌ తీసుకోగా.. రూ.18 కోట్లకు సంజూ శాంసన్‌ను చెన్నై తీసుకుంది.  

2 /6

రిటెన్షన్‌ జాబితాలో మాత్రం చెన్నై మేనేజ్‌మెంట్ ఊహించని నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రూ.13 కోట్లకు పతిరానను నిలుపుకున్న సీఎస్‌కే.. టీమ్‌ నుంచి విడుదల చేసింది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లలో 10.13 ఎకానమీ రేటుతో 13 వికెట్లు తీశాడు.  

3 /6

న్యూజిలాండ్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేలను కూడా టీమ్‌ నుంచి రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్‌లను కూడా విడుదల చేసింది.  

4 /6

యంగ్ ప్లేయర్లు ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్‌లను రిటైన్ చేసుకుంది. నూర్ అహ్మద్, ఆల్ రౌండర్లు శివం దుబే, జేమీ ఓవర్టన్, పేసర్లు ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్‌లపై చెన్నై నమ్మకం ఉంచింది. మినీ వేలానికి చెన్నై సూపర్ కింగ్స్ రూ.43.40 కోట్లతో వెళ్లనుంది.  

5 /6

సంజూ శాంసన్ టీమ్‌లోకి వచ్చినా.. రుతురాజ్ గైక్వాడ్‌నే కెప్టెన్‌గా నియమించింది. గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్.. గాయం కారణంగా తప్పుకున్నాడు. ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈసారి సంజూను కెప్టెన్‌గా నియమిస్తారని ప్రచారం జరగ్గా.. మేనేజ్‌మెంట్ మాత్రం రుతురాజ్‌పైనే నమ్మకం ఉంచింది.  

6 /6

చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ జాబితా: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని, ఆయుష్ మత్రే, డెవాల్డ్ బ్రీవిస్, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (ట్రేడెడ్ ఇన్), శివమ్ దూబే, జామీ ఓవర్‌టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జాప్‌నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్ గోపాల్, నాథన్ ఎల్లిస్.