Special Buses For Chepa Prasadam Distribution 2025: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ వేధికగా చేప ప్రసాదం పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మృగశిర కార్తెను పురస్కరించుకొని ఈ చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
1/5ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజు చేప పంపిణీ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ వేదికగా చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా రేపు ఆదివారం 8న మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ జరగనుంది.
2/5ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి మంత్రి పొన్నం, స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రారంభించనున్నారు. భారీగా ఈ చేప ప్రసాదం పంపిణీకి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
3/5దీంతోపాటు 14 డిపోల నుంచి 140 ప్రత్యేక బస్సులు కూడా నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ఈ బస్సులు ప్రత్యేకంగా చేప ప్రసాదం పంపిణీకి నడుపుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, జేబీఎస్, ఈసిఐఎల్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, దిల్‌షుఖ్ నగర్, ఎన్జీవో కాలనీ, ఉప్పల్, రాజేంద్రనగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
4/5ఇక చేప ప్రసాదం ప్రతి ఏడాది బత్తిని కుటుంబం నిర్వహిస్తుంది. ఈసారి బత్తిని కుటుంబం 16 టోకెన్ కౌంటర్లు, 35 చేప పంపిణీ కౌంటర్లు, 65 మంది అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.అయితే, ప్రతి చేప పిల్ల ధర రూ.40 నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.
5/5ప్రధానంగా ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ చేప ప్రసాదం మంచి ఉపశమనం ఇస్తుందని లక్షలాదిమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ చికిత్స కు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా చాలామంది ఉపశమనం పొందుతున్నట్లు చెబుతున్నారు.