Chia Seeds Or Flax Seeds: ఆరోగ్యవంతమైన చర్మం..పొడవైన నల్లని జుట్టు కేవలం బయట ఉపయోగించే క్రీములు.. ఆయిల్స్ ద్వారానే తెచ్చుకోవాలి అంటే మన మూర్ఖత్వమే అవుతుంది. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారమే.. నిజమైన సౌందర్యానికి పునాది. ముఖ్యంగా చియా గింజలు.. అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్).. జుట్టుకి, శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.. ఈ రెండిటిలో ఎక్కువగా ఏది ఉపయోగకరంగా అంటే..
1/5అవిసె గింజల్లో పుష్కలంగా.. ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మానికి హైడ్రేషన్ అందిస్తాయి. వీటిలో ఉండే లిగ్నాన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ముందస్తుగా వచ్చే..ముడతలను అడ్డుకుంటాయి. రెగ్యులర్‌గా తీసుకుంటే మొటిమలు తగ్గుతాయి.. అలానే తల చర్మంలో నూనె నియంత్రణ క్రమబద్ధం అవుతుంది. వీటిని స్మూతీల్లో, పెరుగులో కలిపి లేదా నీటితో తేలికగా తీసుకోవచ్చు.
2/5చియా గింజలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, దాంతో చర్మం మరింత మెరవడం జరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు ముడతలను.. ఆలస్యం చేస్తాయి. అదేవిధంగా..చియా గింజల్లో ఉన్న ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు బలంగా, మందంగా.. పెరిగేందుకు సహాయపడతాయి. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలలో లేదా పెరుగులో కలిపి తినవచ్చు.
3/5అవిసె గింజలోని విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు, ఒమెగా-3ల వల్ల.. జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది. మెరుపును పెంచుతుంది, తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మానికి ఎప్పుడూ తేమను అందిస్తూ మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది.
4/5మరోపక్క..చియా గింజల్లో ఉన్న ప్రోటీన్లు జుట్టు బలంగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే ఐరన్, జింక్ వంటి ఖనిజాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని వలన జుట్టు త్వరగా పెరుగుతుంది, చర్మం మెరిసిపోతుంది. చర్మం మృదుత్వం.. కాపాడుతూ ముందస్తు వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి.
5/5జుట్టు, చర్మానికి సంపూర్ణ పోషకాలు కావాలనుకుంటే చియా గింజలు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇవి గ్లూటెన్-ఫ్రీగా ఉండటంతో శాకాహారులు, మాంసాహారులు అందరూ వీటిని సులభంగా తీసుకోవచ్చు. అయితే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ కావాలనుకునే వారికి అవిసె గింజలు మరింత ఉపయోగకరంగా ఉంటాయి. క్రమంగా వీటిని ఆహారంలో చేర్చుకుంటే సహజసిద్ధమైన అందాన్ని పొందవచ్చు.