Avika Gor Wedding: అవికా గోర్.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే తెలియకపోవచ్చు కానీ.. చిన్నారి పెళ్లికూతురు అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తు వస్తుంది. అంతలా ఆ సీరియల్‌తో తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది అవికా. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన పర్సనల్ లైఫ్‌లోనూ ముందడుగు వేయబోతుంది. ఈ సెప్టెంబర్ 30న తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది అవికా గోర్.
1/5అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో బాగా పాపులర్ అయింది. ఆ ఫేమ్‌తోనే తెలుగు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అవికా గోర్ మొదటి తెలుగు సినిమా ఉయ్యాల జంపాల. ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించగా, అవికా ఉమా పాత్రలో అందరినీ ఆకట్టుకుంది.
2/5ఆ తర్వాత కూడా అవికా గోర్ తెలుగులో కొన్ని సినిమాలు చేసింది కానీ.. అవి పెద్దగా ఆడియన్స్‌ను ఆకర్షించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఈ అమ్మడు.. అక్కడ వరుస అవకాశాలను సంపాదించింది.
3/5అయితే అవికా గోర్ త్వరలోనే.. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది. జూన్‌లోనే ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కపుల్ సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోనున్నారు.
4/5
దీంతో అవికా అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అవికాకు కాబోయే భర్త ఒక సామాజిక కార్యకర్త. అవికా, మిలింద్ 2019లో ఒక కార్యక్రమంలో కలిశారు. ఆ పరిచయం స్నేహంగా మారి, తర్వాత ప్రేమగా మారింది.
5/5దాదాపు ఐదేళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ కపుల్.. తమ ప్రేమ గురించి ఇంట్లో పెద్దలకు చెప్పగా, వారు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. వారంలోనే ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారు. తమ ఫేవరేట్ హీరోయిన్ పెళ్లి కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.