Add Zee Business As A Preferred Source
App

Chinta Chiguru Chutney: నోరూరించే చింతచిగురు చట్నీ.. ఇడ్లీతో తింటే అదరహో..!

Written ByVishnupriya
Published: Sep 12, 2025, 07:48 PM IST|Updated: Sep 12, 2025, 07:48 PM IST

Chinta Chiguru Chutney Recipe : ఇడ్లీ, దోశల్లోకి మంచి చెట్నీ ఉంటే ఇంకా ఆ రుచే వేరు.. ముఖ్యంగా అది ఆరోగ్యకరమైన చట్నీ అయితే.. ఇక అంతకన్నా ఏమి కావాలి. మరి ఇడ్లీ చట్నీకి అధరహో అనిపించి చింతచిగురు చట్నీ ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం.. ఈ చెట్ని రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది..
 

Idli Chutney1/5

నోరూరించే చింతచిగురు చట్నీ

ఇడ్లీ, దోశల్లోకి మంచి చెట్నీ ఉంటే.. ఆ మజానే వేరు. ఆ చట్నీ ఆరోగ్యకరమైనది అయితే.. ఇక అంతకన్నా అదృష్టం ఏమిటి చెప్పండి. మరి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే ఆరోగ్యకరమైన చింతచిగురు చెట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం.   

Dosa Chutney2/5

నోరూరించే చింతచిగురు చట్నీ

ముందుగా ఒక కట్ట.. చింతచిగురును ఆకుల తీసుకొని.. నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఆ చింతచిగురుని.. పాన్ లో వేసి కొద్దిగా ఉడకనివ్వాలి.

Tamarind Leaves Chutney3/5

నోరూరించే చింతచిగురు చట్నీ

ఆ తరువాత..2 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వేయించిన వేరుశనగపప్పులు.. మిక్సీ పట్టుకోవాలి. చింతచిగురు బాగా మెత్తబడే వరకు మిక్సీ వేసుకోవాలి.

Easy Chutney Recipe4/5

నోరూరించే చింతచిగురు చట్నీ

ఇక చివరిగా.. నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేసి పచ్చడిలో కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు చట్నీ రెడీ. 

Tasty Chutney Recipe5/5

నోరూరించే చింతచిగురు చట్నీ

ఈ చట్నీ ఇడ్లీ, దోసెల్లోకి కాకుండా నెయ్యి వేసుకొని అన్నంలో తిన్నా కానీ ఎంతో రుచిగా ఉంటుంది.