Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి తన 47 ఏళ్ల కెరీర్ లో దాదాపు 155 చిత్రాల్లో నటించారు. అందులో ఎంతో మంది హీరోయిన్స్ నటించారు. అందులో ఒకే ఒక్క హీరోయిన్ (Rare Actress) మాత్రం చిరంజీవి సరసన హీరోయిన్ గా.. భార్యగా.. ప్రియురాలిగా.. చెల్లెలుగా.. అక్కగా.. తల్లిగా నటించిన హీరోయిన్ ఒక్కరే ఉన్నారు. ఇంతకీ ఎవరనేగా డౌటు.. ఈ స్టోరీ చదవాల్సిందే..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దాదాపు తన 47 ఏళ్ల కెరీర్ లో దాదాపు 100 మంది హీరోయిన్స్ ఆయన సరసన నటించారు. అందులో ఒకే ఒక్క కథానాయికకు మాత్రం ప్రత్యేకత ఉంది. చిరంజీవి హీరోగా ఎదుగుతున్న టైమ్ లో కథానాయికగా నటించిన ఆమె.. ఆయన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా.. అక్క పాత్రలో తల్లి పాత్రలో నటించి మెప్పించింది.
అవును చిరంజీవి హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఎస్.పి.చిట్టిబాబు దర్శకత్వంలో ‘ప్రేమ తరంగాలు’ సినిమాలో నటించారు. ఇందులో మెయిన్ హీరో కృష్ణంరాజు. ఈ సినిమా హిందీలో అమితాబ్, వినోద్ ఖన్నా హీరోలుగా నటించిన ‘ముఖద్దర్ కా సికందర్’ సినిమాకు రీమేక్. ఈ చిత్రంలో చిరు..వినోద్ ఖన్నా పాత్రలో నటిస్తే.. అమితాబ్ పాత్రలో కృష్ణంరాజు నటించారు.
‘ప్రేమ తరంగాలు’ సినిమాలో చిరంజీవి సరసన సుజాత నటించింది. ఆయన సరసన సుజాత హీరోయిన్ గా నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం.
ఆ తర్వాత చిరంజీవి హీరోగా ఈరంకి శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా దేవి’. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రలో సుజాత నటించింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.
ఇక చిరంజీవి స్టార్ డమ్ వచ్చాకా.. క్రాంతి కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అగ్ని గుండం’ చిత్రంలో సుజాత .. చిరంజీవి అక్క పాత్రలో నటించింది. ఈ సినిమా సరైన విజయం సాధించలేదు.
ఇక చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన చివరి చిత్రం ‘బిగ్ బాస్’. ఈ సినిమాలో చిరంజీవి తల్లి పాత్రలో దివంగత సుజాత నటించింది. ఈ రకంగా చిరంజీవి సరసన భార్య, ప్రియురాలిగా.. చెల్లిగా..అక్కగా..తల్లిగా నటించిన హీరోయిన్ గా సుజాత నిలిచిపోయింది. మరే కథానాయికా ఇలా తల్లిగా.. చెల్లిగా.. అక్కగా.. ప్రియురాలిగా నటించిన హీరోయిన్ ఎవరు లేరు.