Add Zee Business As A Preferred Source
App

Chiranjeevi Vs Balakrishna: బాలయ్య వివాదంలో కొత్త ట్విస్ట్.. ఏకంగా 300 పీఎస్‌లలో ఫిర్యాదులకు ఫ్యాన్స్ రెడీ.. చిరంజీవి ఏమన్నారంటే..?

Written ByInamdar Paresh
Published: Sep 29, 2025, 09:13 PM IST|Updated: Sep 29, 2025, 09:22 PM IST

Balakrishna comments on Chiranjeevi: బాలయ్య, చిరంజీవి వివాదంలో రెండు తెలుగు స్టేట్స్ అభిమానులు హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ దగ్గరలోని హోటల్లో  సమావేశం అయ్యారు. ఏకంగా బాలయ్యపై రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా 300 ఫిర్యాదులు చేసేందుకు అభిమానులు రెడీ అయిపోయారు. దీనిపై చిరంజీవి అభిమానులకు కీలక సూచనలు చేశారు.
 

Chiranjeevi:1/6

చిరుపై బాలయ్య రచ్చ:

ఏపీ అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల్ని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు ఆల్రేడి రికార్డుల నుంచి తొలగించాలని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో బాలయ్య, చిరుల మధ్య వార్ మాత్రం పీక్స్ కు చేరుకుంది.  

Bala krishna:2/6

బాలయ్య వివాదం:

తాజాగా.. చిరంజీవి అభిమానులు మాత్రం ఈ విషయాన్ని వదిలేది లేదని గట్టిగా పట్టుకున్నట్లు తెలుస్తొంది.హైదరాబాద్ సమీపంలోని బ్లడ్ బ్యాంక్ లో దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల చిరు అభిమానులు సమావేశం నిర్వహించారు.. ముఖ్యంగా బాలయ్యపై రెండు తెలుగుస్టేట్స్ లలో కూడా దాదాపు 300 పీఎస్ లలో ఫిర్యాదులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు..  

ap assembly sessaion:3/6

ఏపీ అసెంబ్లీ సమావేశాలు:

అయితే..ఈ విషయం కాస్త చిరంజీవికి తెలవడంతో చిరు ఇలాంటి పనులు చేయోద్దని సున్నితంగా హెచ్చరించారు. ఈ ఘటనతో మరోసారి చిరు, బాలయ్యవివాాదం వార్తలలో నిలిచింది.  ఇప్పటికే చిరు అభిమానులు అనేక చోట్ల బాలయ్య దిష్టిబొమ్మలు సైతం దహనం చేశారు. అంతేకాకుండా.. చిరంజీవికి వెంటనేసారీ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.  

Balakrishna:4/6

బాలయ్య వర్సెస్ చిరంజీవి:

ఈ క్రమంలోనే  చిరు అభిమానులు తొందర పడినట్లు వార్తలు చిరంజీవికి తెలియడంతో ఆయనపై దీనిపై కొంచెం సీరియస్ గానే వారించారని, ఇలాంటి పనులు చేయోద్దని చెప్పారని సమాచారం. మరోవైపు చంద్రబాబు నాయుడు, పవన్ లు ఈ విషయంలో మధ్య వర్తిత్వంవహించారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానులు ఈ విధంగా రియాక్ట్ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.   

chiranjeevi vs bala krishna:5/6

చిరంజీవి:

 బాలయ్య అసెంబ్లీలో చిరంజీవి ఫోర్స్ వల్ల అప్పటి సీఎం జగన్ దిగొచ్చి పరిశ్రమల పెద్దలతో మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. అంతేకాకుండా సెలబ్రీటీల్ని జగన్ అవమాన పర్చారని సైకో అంటూ జగన్ కూడా వెటకారంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ కూడా ఇచ్చారు.

balayya vs chiru:6/6

బాలయ్య:

అప్పటి సీఎం జగన్ తమను మర్యాద పూర్వకంగా పిలిస్తేనే వెళ్లామని, కోవిడ్ నేపథ్యంలో పరిశ్రమపెద్దల్ని ఐదుగురితో రమ్మంటే.. తాము పదిమందిలో వెళ్లామని, తమకు మర్యాదలో ఎక్కడా కూడా లోటు పాట్లు జరగలేదని చిరంజీవి తన లేఖలో స్పష్టం చేశారు. ఈ క్రమంలో చిరు రాసిన బహిరంగలేఖ రాజకీయాలతో పాటు, ఇండస్ట్రీలో కూడా దుమారంగా మారింది.