Meghana Raj second marriage
దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘన రాజ్ మళ్లీ పెళ్లికి సిద్ధమైంది అని వార్తలు సోషల్ మీడియాలో తెగ జోరు అందుకున్నాయి. అర్జున్ మేనల్లుడు చిరంజీవి కొద్ది సంవత్సరాల క్రితమే తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అతను చనిపోయే తప్పటికి మేఘన ప్రెగ్నెంట్ గా ఉంది. ఆ తర్వాత వీరిద్దరికీ ఒక బిడ్డ జన్మించారు.
కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందిన చిరంజీవి సర్జా, ఆయన భార్య మేఘన రాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఈమె గర్భవతిగా ఉన్న సమయంలోనే చిరంజీవి సర్జా మరణ వార్త అందరిని కలచి వేసింది..ఆ తర్వాత మేఘనా రాజ్ కి ఒక కుమారుడు జన్మించారు. తన కొడుకు లోనే తన భర్తని చూసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్న మేఘనా రాజ్ .. ఆ తర్వాత రెండవ పెళ్లి చేసుకోబోతోందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ విషయం పైన మేఘన రాజ్ స్పందించి క్లారిటీ ఇవ్వడం జరిగింది..
మేఘన రాజ్ మాట్లాడుతూ.. ఇలాంటి వార్తలు చదివినప్పుడు తనకి చాలా బాధేస్తుందని తెలిపింది. చాలామంది కూడా తనని రెండో వివాహం చేసుకోమని సలహా ఇచ్చారు అంటూ తెలిపింది. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెతో.. మీ కుమారుడు రాన్యాకు తండ్రి అవసరం లేదా అంటూ యాంకర్ అడగగా. .రాన్యాకు తండ్రి ఉన్నారని సమాధానాన్ని తెలిపింది .
తన తండ్రి చిరు సర్జా అని.. రాన్యాకు తన తండ్రి చిరు అని తెలుస్తుంది. తన తండ్రి పాటలు కూడా వింటాడు.. కానీ తన తండ్రిని మాత్రం భౌతికంగా చూడలేడు అంటూ తెలియజేసింది. కానీ రాన్యాకు తన తండ్రి భౌతిక రూపం ఉంటే బాగుంటుందని కూడా ఎమోషనల్ గా మాట్లాడింది మేఘనా రాజ్.
ఇక రెండో పెళ్లి విషయం పై కూడా మాట్లాడుతూ.. రెండో పెళ్లి గురించి ఆలోచిస్తున్నాననే విషయం నిజం కాదంటూ తెలియజేసింది.. తన భర్త చిరంజీవి సర్జా కూడా ఎప్పుడూ ఒక మాట చెప్పే వాళ్ళని, ఈ ప్రపంచం ఏమనుకుంటుందో ఎప్పుడు పట్టించుకోకు. నీ మనసు చెప్పిందే చేయి అని చెప్పేవారిని గుర్తు చేసుకుంది.
“పెళ్లి గురించి ఎప్పుడూ కూడా నేను నా మనసులో ప్రశ్న వేసుకోలేదని..రేపు ఏం జరుగుతుందో కొద్దిరోజులయ్యాక నా జీవితం ఎలా ఉంటుందో.. అనే విషయాన్ని ఎప్పుడు ఆలోచించలేదు,” అని వెల్లడించింది. మొత్తానికి రెండో పెళ్లి పైన క్లారిటీ ఇచ్చేసింది మేఘనా రాజ్. మేఘనా, చిరంజీవి సుమారుగా పదేళ్లు ప్రేమలో ఉండి 2018 లో పెళ్లి చేసుకోగా 2020లో గుండెపోటుతో చిరంజీవి సర్జా మరణించారు.