Nara Devansh Receives Award In London: సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ అరుదైన ఘనత సాధించాడు. ఫాస్టెస్ట్ చెక్‌మెట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను నారా దేవాన్ష్ సొంతం చేసుకున్నాడు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా దేవాన్ష్ ఈ అవార్డును అందుకున్నాడు. చిన్న వయస్సులోనే దేవాన్ష్ సాధించిన ఈ గొప్ప విజయం అందరినీ ఆకర్షించింది.
1/5ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ లండన్‌లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025 కార్యక్రమంలో అవార్డు అందుకున్నాడు. వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో నిర్వహించిన ఈ వేడుకకు నారా లోకేశ్, బ్రాహ్మిణి హాజరయ్యారు.
2/5గత నారా దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం 9 ఏళ్ల వయస్సులోనే ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
3/5అలాగే, మరో రెండు రికార్డులను ప్రతిష్టాత్మక ‘వరల్డ్ బుక్ఆఫ్ రికార్డ్స్–లండన్’ అధికారికంగా ధ్రువీకరించింది. వ్యూహాత్మకమైన ఆటతీరుతో 11 నిమిషాల 59 సెకన్లలో చెక్‌మేట్ పజిల్స్ పూర్తి చేసిన దేవాంశ్.. ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే, తాజాగా.. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకుల చేతుల మీదుగా దేవాన్ష్ అవార్డు అందుకున్నాడు.
4/5దేవాన్ష్ సాధించిన ఈ ఘనత ఎంతో గర్వకారణంగా ఉందన్నారు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్. 10 ఏళ్ల వయస్సులోనే తన ఆలోచనలకు పదును పెడుతూ.. స్ట్రెస్‌గా పీస్‌ఫుల్‌గా ఉంటూ.. ఎంతో అంకిత భావంతో తన కొడుకు చెస్ నేర్చుకున్నాడన్నారు.
5/5దేవాన్ష్ కష్టాన్ని, గంటల తరబడి చేసిన కఠోర శ్రమను ఓ తండ్రిగా దగ్గరుండి ప్రత్యక్షంగా చూశానని నారా లోకేశ్ అన్నారు. తన కొడుకు కష్టానికి తగ్గ ఫలితం చూసి ఎంతో ఆనందిస్తున్నట్లు తెలిపారు.