cm revanth reddy on govt Jobs: తెలంగాణలో మళ్లీ కొలువుల జాతర మొదలైందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే ఆర్టీసీలో కొలువులకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం మరోసారి భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ డ్రైవ్ కు సిద్దమైంది. దీంతో నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు.
1/6తెలంగాణలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కొలువుల భర్తీపై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీలో 1743 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తంగా.. 1,743 పోస్టులలో.. 100 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో దీనిపై ఇప్పటికే నిరుద్యోగుల ఫుల్ పండగ చేసుకుంటున్నారు.
2/6అయితే.. మరల పోలీసు శాఖలో జంబో నోటిఫికేషన్ కు రేవంత్ సర్కారు భారీగా కసరత్తులు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తం 12,452 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీస్ శాఖ తమ విభాగంలోని ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు వార్తలు వస్తున్నాయి.
3/6పోలీసు అధికారులు ఖాళీల్ని ఆర్థిక శాఖకు పంపించారు. అయితే.. ముఖ్యంగా పోలీసు శాఖలో.. ఈ భర్తీలు ఉండనున్నాయి. అత్యధికంగా సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో 8,442 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ పోస్టులు 3,271 ఉన్నాయి. ఈ రెండు కేటగిరీలలోనే దాదాపు 11 వేలకు పైగా ఖాళీలు ఉండటంతో, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతకు ఇది గొప్ప వరంగా చెప్పవచ్చు.
4/6కానిస్టేబుల్ పోస్టులతో పాటు సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) స్థాయి ఉద్యోగాలు కూడా ఈసారి భారీగా ఉన్నాయి. సివిల్ ఎస్సై కేటగిరీలో 677, ఏఆర్ ఎస్సై కేటగిరీలో 40, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (టీజీఎస్‌పీ) విభాగంలో 22 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని నివేదికలో పేర్కొన్నారు.
5/6శాఖలవారీగా ఖాళీలపై దృష్టి సారించిన ప్రభుత్వం, వీలైనంత త్వరగా ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అపోసిషన్ పార్టీలు జాబ్ క్యాలెండర్ అంటూ రేవంత్ సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తుంది.
6/6ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు అప్రమత్తమై జాబ్ నోటిఫికేషన్ ల విడుదలపై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం లభించిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.