Cobra Snake Facts: పాములు కుబుసం విడవడం, మరో పాముతో జతకట్టడం గురించి ఈ రహాస్యాలు మీకు తెలుసా..?

Venomous Cobra Snakes Facts: చాలా పాములు తరచుగా కుబుసంను అడవుల్లో, చెట్లలో విడుస్తుంటాయి. అంతేకాకుండా.. మరో పాముతో సయ్యాట లాడుతుంటాయి. దీని వెనుక ఉన్న అసలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /6

పాములు చాలా వరకు విషపూరితమైనవి కావు. కొన్ని పాములు మాత్రమే తమ కోరల్లో విషాన్ని కల్గి ఉంటాయి. కానీ పాములు.. తక్కువ సందర్బాలలో మాత్రమే కాటు వేస్తాయంట. అసలు.. మనిషి వస్తున్నాడని వాటికి తరంగాల రూపంలో వాటి శరీరంకు తెలిసిపోతుందంట. దీంతో  పాములు ఆ ప్రదేశంలో నుంచి వెళ్లి పోతాయి.  

2 /6

అంతేకాకుండా.. పాములు అడవుల్లో, చెట్లల్లో కుబుసం విడవం మనం చూస్తుంటాం. అవి ఆ సమయంలో చాలా కోపంగాను ఉంటాయి. దీని వల్ల.. కొత్త చర్మం వాటికి వస్తుంది. ముఖ్యంగా పాములు.. ప్రతి ఆరునెలలకు ఒక సారి కుబుసం విడుస్తాయంట.   

3 /6

ఆ సమయంలో  అవి చాలా కోపంగా ఉంటాయి. కోబ్రాలు కుబుసం విడిచి.. మళ్లీ కొత్త చర్మంను పొందుతాయి. కుబుసం విడిచాక.. కొన్ని రోజుల పాటు పాములు అస్సలు జనావాసాల్లోకి రావంట. అడవుల్లో, దట్టంగా ఉండే చెట్లలోనే ఉంటాయంట. అందుకే పాముల్ని చాలా మంది ఆ సమయంలో చూసేందుకు అస్సలు సాహాసం చేయరు.  

4 /6

పాములు.. మరో పాముతో సంభోగం చేసే విషయంలో అనేక షాకింగ్ అంశాలు ఉన్నాయి.. పాములు లైంగికంగా రెడీగా ఉన్నప్పుడు.. వాటి శరీరం నుంచి ప్రత్యేకమైన రసాయంను వదులుతాయంట. వీటి వాసన.. ఒక పదికిలో మీటర్ల దూరంగా ఉన్న మగ పాముల్ని కూడా ఆకర్శిస్తుందంట. దీంతో అవి అక్కడి నుంచి వేగంగా పాము వైపుకు వస్తాయంట.  

5 /6

 ఆ మగ పాములు మధ్యలో పోటీ ఏర్పడి... కొన్నిసార్లు పరస్పరం కొరుక్కుని కాటులు వేసుకుంటాయంట. దీనిలో కొన్ని పాములతో మాత్రమే ఆడ పాము సంభోగం చేస్తుందంట. అయితే.. పాములు తమ కన్నా.. చిన్నగా ఉండే పాములతో సంభోగం చేస్తాయంట.  

6 /6

 అయితే.. సంభోగం అనంతరం ఆడపాములు మగపాముల్ని కొరికి చంపుతాయంట. అయితే..ఈ వైరల్ కంటెంట్ లో ఎంత నిజముందో కానీ.. మొత్తంగా ఈ పాముల అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.