Add Zee Business As A Preferred Source
App

College Holiday: అక్టోబర్ 13 నుంచి తెలంగాణ ప్రైవేట్ కాలేజీలకు సెలవు…కారణమేమిటంటే..!

Written ByVishnupriya
Published: Oct 07, 2025, 10:38 PM IST|Updated: Oct 07, 2025, 10:38 PM IST

College Holiday List : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే అక్టోబర్ 13 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ..పీజీ కాలేజీలు మూసివేస్తామని అసోసియేషన్ హెచ్చరిక జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
 

Colleges Holiday in Telengana1/5

తెలంగాణ కాలేజీల బంద్‌

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు మళ్లీ బంద్‌ దిశగా వెళ్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇంకా చెల్లించకపోవడంతో..రాష్ట్ర ప్రైవేట్ కళాశాలల నిర్వహణ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బకాయిలను అక్టోబర్ 12లోపు విడుదల చేయకపోతే అక్టోబర్ 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు మూసివేస్తామని వారు స్పష్టంగా ప్రకటించారు.

Colleges Bandh 2/5

తెలంగాణ కాలేజీల బంద్‌

సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి. సత్యనారాయణ రెడ్డి తెలిపారు, ప్రభుత్వం గత నెలలో రూ.900 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, అక్టోబర్ 1 వరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించిందని అన్నారు. దసరాకు ముందు రూ.600 కోట్లు, దీపావళికి ముందు మరిన్ని రూ.600 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ పెండింగ్‌ బకాయిలు మిగిలే ఉన్నాయని తెలిపారు.

Colleges Holiday in October 3/5

తెలంగాణ కాలేజీల బంద్‌

బకాయిలు వెంటనే చెల్లించకపోతే అక్టోబర్ 13 నుంచి అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు మూసివేయడం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ నిర్ణయానికి మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. రెండు ప్రభుత్వాలు .. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ..రెండూ కలిసి దాదాపు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించలేదని ఆయన విమర్శించారు.

Holiday in October 4/5

తెలంగాణ కాలేజీల బంద్‌

గత నెలలో కూడా ఈ సంఘం ఇదే డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగింది. ఈసారి మరోసారి సమ్మెకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరపాలని ఆదేశించారు. ఆయన ఈ వారం వారితో సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Educational Institutes Closed 5/5

తెలంగాణ కాలేజీల బంద్‌

విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీ సిబ్బంది ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి బకాయిలు చెల్లిస్తే విద్యార్థుల చదువులు అంతరాయం లేకుండా కొనసాగవచ్చని వారు కోరుతున్నారు.