Coocaa S4U Plus Full HD LED Smart TV Price: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 50 అంగుళాల స్మార్ట్ టీవీపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 11 వేల లోపే Coocaa S4U Plus స్మార్ట్ టీవీ లభిస్తుంది. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Coocaa S4U Plus Full HD LED Smart TV Price Telugu: ఎప్పటినుంచో అత్యంత తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన బిగ్ బిలియన్స్ డేస్ సేల్లో భాగంగా కొన్ని స్మార్ట్ టీవీలు అత్యంత చీప్ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన గూగుల్ టీవీలు చీప్ ధరకే లభిస్తున్నాయి.
1/6ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ Coocaa ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన 50 అంగుళాల స్మార్ట్‌టీవీ అత్యంత చీపు దరకే లభిస్తుంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఉండడమే కాకుండా.. ఎన్నో రకాల బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అలాగే స్పెషల్‌గా ఈ సేల్లో ఎక్స్చేంజ్ బోనస్ ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.
2/6ఈ Coocaa S4U Plus 50 అంగుళాల స్మార్ట్ టీవీ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రత్యేకమైన ఫుల్ హెచ్డి ఎల్ఈడి డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో లభిస్తోంది.. ఇక ఇది కూలిటా (Coolita) 3.0 ఆపరేటింగ్ సిస్టమ్ (Coolita 3.0 OS) పై రన్ అవుతుంది.
3/6ఈ స్మార్ట్ టీవీ మార్కెట్‌లోకి 50S4U Plus అనే మోడల్‌తో విడుదలైంది. ఇందులో కంపెనీ ప్రత్యేకమైన డాల్బీ ఆడియో (Dolby Audio) సపోర్ట్ సపోర్టును కూడా అందిస్తోంది. అలాగే నారో ఫ్రేమ్ డిజైన్ (Narrow Frame Design )తో అందుబాటులో ఉంది. ఇందులో ఎలాంటి సబ్క్క్రిప్షన్ లేకుండానే దాదాపు ఫ్రీగా 300 పైగా చానల్‌లోను చూడొచ్చు.
4/6ఇక ఈ స్మార్ట్ టీవీలో ప్రత్యేకమైన ఐ కేర్ టెక్నాలజీ కూడా లభిస్తుంది. దీంతోపాటు వాయిస్ కంట్రోల్ ఫీచర్, CC కాస్ట్ (CC Cast) స్క్రీన్ మిర్రరింగ్, Wi-Fi, HDMI, USB పోర్ట్‌లు వంటి కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా కొన్ని యాప్స్ కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది..
5/6ఇక ఈ టీవీపై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. మార్కెట్లో దీని ధర రూ.39,990 కాగా.. బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా 57 శాతం తగ్గింపుతో కేవలం రూ.16,999కే అందుబాటులో ఉంది. అలాగే అదనంగా కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కొనుగోలు చేసే వారికి.. రూ.1,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
6/6స్మార్ట్ టీవీపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ అన్ని పోను రూ.15,744కే దీనిని పొందవచ్చు. అలాగే దీనిపై ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఏదైనా పాత స్మార్ట్ టీవీని ఎక్స్చేంజ్ చేస్తే రూ.4,000 వరకు బోనస్ లభిస్తుంది. ఈ బోనస్‌ను టీవీ ధర నుంచి మైనస్ చేస్తే రూ.11,740కే ఈ కొత్త స్మార్ట్ టీవీ పొందవచ్చు..