Add Zee Business As A Preferred Source
App

CP Radhakrishnan Oath as Vice President of india: దేశ 15వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్..

Written ByTA Kiran Kumar
Published: Sep 12, 2025, 01:56 PM IST|Updated: Sep 12, 2025, 01:56 PM IST

CP Radhakrishnan Oath as Vice President of india: దేశ కొత్త  ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌  ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది.  

 

CP Radhakrishnan Oath as Vice President of india1/5

సీపీ రాధాకృష్ణన్

CP Radhakrishnan Oath as Vice President of india: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీపీ రాధాకృష్ణన్ చేత ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. CP రాధాకృష్ణన్‌ 15వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. 

Vice President of india Oath2/5

ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం

ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ తన సమీప ప్రత్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తి కావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి సీపీ రాధాకృష్ణన్‌ రాజీనామా చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు ముందు రాధాకృష్ణన్.. రాజ్ ఘాట్.. కిసాన్ ఘాట్ తో పాటు వాజ్ పేయ్ మరియు దీనదయాళ్ ఉపాధ్యాయ ఘాట్ లను సందర్శించారు. 

 

CP Radha Krishnan 3/5

సీపీ రాధాకృష్ణన్

దీంతో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాష్ట్రపతి ముర్ము అప్పగించారు. ఈ నెల 9న జరిగిన  ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో  మొత్తం 781 మంది సభ్యులకుగాను 767 మంది పార్లమెంట్‌ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Vice President of India 4/5

ఉప రాష్ట్రపతి

ఈ ఎన్నికల్లో  ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ కు విజయానికి 377 ఓట్లు కాగా..  రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు, సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. 14 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. పోలైన మొత్తం ఓట్లలో 15 చెల్లనివిగా గుర్తించడం విశేషం. దీంతో 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్‌ గెలుపొందారు. 

17th Vice President of India 5/5

17వ ఉప రాష్ట్రపతి

భారత 17వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన  సీపీ రాధాకృష్ణన్‌ పూర్తి పేరు చంద్రపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్‌. 1957 అక్టోబరు 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఆయన జన్మించారు. తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతి పీఠం అధిష్ఠించనున్న మూడో వ్యక్తిగా రాధాకృష్ణన్‌ గుర్తింపు పొందారు. రాధాకృష్ణన్ పేరున్న రెండో వ్యక్తి ఉప రాష్ట్రపతి కావడం విశేషం.