Credit card offers : దసరా పండగ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ క్రెడిట్ కార్డులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మీకోసం
కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు ఈ మధ్యకాలంలో పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిలో క్రెడిట్కార్డులపై ఆఫర్స్, డీల్స్ చాలా ముఖ్యమైనవి. అనేక బ్యాంకులు రెస్టారెంట్లలో డైన్ ఇన్ ఆఫర్స్ నుంచి షాపింగ్ డిస్కౌంట్ వరకు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఆఫర్ ఇస్తున్నాయి. తాజాగా కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై కొత్త ఆఫర్స్, డీల్స్ ను ప్రకటించాయి. మీరు వాడు క్రెడిట్ కార్డు ఈ లిస్టులో ఉందా. ఉంటే ఎలాంటి ఆఫర్స్ డీల్స్ కొత్తగా యాడ్ అయ్యాయి. తెలుసుకుందాం.
ఐడీబీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు స్విగ్గీ ఇన్ స్టామార్ట్ లో రూ. 150 నుంచి 20శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 30,2024 వరకు అందుబాటులో ఉంటుంది. బుక్ మై షోలో ఐడీబీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యాప్ లేదా వెబ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే 25శతం నుంచి 300 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. పీవీఆర్ ఫ్లాట్ 25శాతం, ప్లాటినం, సిగ్నేచర్ కార్డులపై రూ. 150 వరకు ఐనాక్స్ , ఇతర కార్డులపై రూ. 75 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లన్నీ దాదాపు కాలపరిమితితో కూడుకున్నవే.
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీ వద్ద ఉంటే ఈప్రత్యేకమైన డిస్కౌంట్లు, ఆఫర్లను మీరు పొందవచ్చు. స్విగ్గీపై రూ. 100, ఏథర్ పై 7.5శాతం,బ్లాక్ బెర్రీస్ వీఐపై 5శాతం అదనపు క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.
యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మ్యాక్స్ ఫ్యాషన్ పై 1.5శాతం తగ్గింపు ఇస్తుంది. ఇది నవంబర్ 3,2024 ను ముగుస్తుంది. ఐఫోన్ పై రూ. 8వేల వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్, గోఐబిబోలో విమానాలు, హోటళ్లపై 20శాతం, ఈఎంఐ ఆఫర్ శాంసంగ్ అందిస్తోంది. అమెజాన్ ఫ్రెష్ పై రూ. 300 ఇన్సంట్ డిస్కౌంట్ అందిస్తోంది.
హోం టౌన్ ఫర్నిచర్ పై 5శాతం, మాడ్యులర్ కిచెన్ పై 15శాతం డిస్కౌంట్ ఉంది.
కోటక్ క్రెడిట్ కార్డు ఈఎంఐపై 10శాతం తగ్గింపు ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఆర్గానిక్ హార్వెస్ట్ లో రూ. 400 లేదా అంతకంటే ఎక్కువ విలువైన షాపింగ్ పై 40శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తే 15శాతం ఎక్స్ ట్రా డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ కార్డులో జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు ఉండదు. ఇంధన సర్ ఛార్జీపై డిస్కౌంట్ పొందడం ద్వారా మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చు. గిఫ్ట్స్ వోచర్ల కోసం మీరు ఐసీఐసీఐ బ్యాంకు రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.