Cricketers Favourite: టాలీవుడ్ హీరోలంటే ఇష్టమంటున్న మన క్రికెటర్స్..? ఇంతకీ ఎవరో తెలుసా..?
విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లి మాజీ భారత క్రికెట్ కెప్టెన్‌గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మనోడికి తెలుగు హీరో ఎన్టీఆర్ అంటే ఇష్టమంట. ఆయన సినిమాలను డబ్బింగ్ వెర్షన్‌లో ఎన్నో చూసాడట. అంతేకాదు ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ నటన అంటే తనకు ఇష్టమని చెప్పారు. అనుష్కతో కలిసి నాటు నాటు పాటపై ఎన్నో రీల్స్ చేశాము. ఓ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ వచ్చిందని తెలుసుకొని.. అక్కడే గ్రౌండ్‌లో ఆ స్టెప్పులేసాము.
మహేంద్ర సింగ్ ధోని
మన దేశానికి కపిల్ దేవ్ తర్వాత క్రికెట్‌లో వరల్డ్ కప్ తీసుకొచ్చిన కెప్టెన్‌గా ధోని చరిత్రకెక్కారు. ఇక యాక్టర్‌గా కాకుండా.. ఓ వ్యక్తిగా రజినీకాంత్ అంటే ఎంతో ఇష్టం. చిన్నపుడు రజినీకాంత్‌ను కలవాలని కలలు కనేవాణ్ణి. కానీ క్రికెటర్ అయ్యాకా.. బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేకపోయాను. ఇక తన జీవితంపై తెరకెక్కిన బయోపిక్ ప్రమోషన్‌లో భాగంగా రజినీకాంత్ గారిని కలుసుకునే అవకాశం దక్కిందని చెప్పారు. ఆయన సినిమాల్లో ముత్తు, దళపతి, బాషా సినిమాలను ఎన్ని సార్లు చూసానో లెక్కేలేదు.
శ్రేయస్ అయ్యర్.. శ్రేయస్ అయ్యర్.. బాహుబలి సినిమాతో ప్రభాస్‌కు వీరాభిమానిగా మారిపోయాను. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్‌ను ఫాలో అవుతున్నాను. ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కల్కి సినిమా కోసం కామన్ ఆడియన్స్‌తో పాటు ఎపుడెపుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. మ్యాచ్ లేకపోతే తొలిరోజు తొలిఆట చూడాల్సిందే.
రవీంద్ర జడేజా
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా చూడగానే ఆయనకు పెద్ద ఫ్యాన్ అయ్యాను. పుష్పలో ఆయన యాక్టింగ్ పై రీల్స్ చేశాను. ఇక ఖాళీగా ఉన్న సమయాల్లో అల్లు అర్జున్ నటించిన సినిమాలన్ని చూసేశాను. ఒక్కో సినిమాకు అల్లు అర్జున్ నటనలో ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి నాకు ఆశ్చర్యమేసింది.
సూర్య కుమార్ క్రికెటర్ సూర్యకుమార్ తనకు తనకు హీరో విజయ్ అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో థియేటర్స్‌లో ఆ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవాడిని. ప్రస్తుతం బిజీ షెడ్యూల్లో భాగంగా ఇపుడు సినిమాలు చూసే తీరిక దొరకడం లేదు. ఎక్కువగా ఓటీటీలో చూస్తున్నాను. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో నాకు అంతగా నిద్రపట్టదు. అందుకే తన ట్యాబ్‌లో కొన్ని సినిమాలు డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుకున్నాను. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన 'వారసుడు' సినిమా తన ఫేవరేట్ మూవీ