Add Zee Business As A Preferred Source
App

Paneer Pakora: బయట చల్ల చల్లని వర్షం.. ఇంట్లో వేడివేడిగా కరకరలాడే పన్నీర్ పకోడా ఎలా చేసుకోవాలంటే..!

Written ByVishnupriya
Published: Sep 02, 2025, 09:49 PM IST|Updated: Sep 02, 2025, 09:49 PM IST

Rainy Season Snacks

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయంత్రమైతే చాలా పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ ఏదైనా వేడివేడిగా తినాలి అనిపిస్తది. మరి ఇంత చల్ల చల్లని వర్షంలో వేడివేడిగా తినగలిగే పన్నీర్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం..

Best Snacks During Rain 1/5

సులభమైన పన్నీర్ పకోడా రెసిపీ,

పన్నీర్ నచ్చని వారు పెద్దగా ఎవ్వరూ ఉండరు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యానికి కూడా పన్నీర్ ఎంతో మేలు చేస్తుంది.

Required Ingredients 2/5

కావలసిన పదార్థాలు

శనగపిండి ఒక కప్పు  పన్నీర్ 250 గ్రాములు  బియ్యప్పిండి : ¼ కప్పు  ఒక టేబుల్ స్పూన్ కారం,  1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వాముపొడి,  1/2 టేబుల్ స్పూన్ జీరాపొడి,  1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా,  రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, నూనె, నీళ్లు 

Paneer Pakora Preparation Method 3/5

వర్షాకాలపు స్నాక్స్,

ముందుగా పన్నీరుని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.. ఆ తర్వాత పైన చెప్పిన వస్తువుల అన్ని కలిపి.. కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మిశ్రమం తయారు చేసుకోవాలి. 

Paneer Pakore Recipe 4/5

కరకరలాడే పన్నీర్ పకోడా,

మిశ్రమం మరి నీళ్ళగా కాకుండా పన్నీర్ ముంచితే పన్నీర్ కి అతుక్కునేలా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ని ఆ మిశ్రమంలో ముంచి.. పక్కన స్టవ్ పైన బాణలిలో నూనె కాగాక.. అందులో వేసుకోవాలి. 

Paneer Pakora in Rain 5/5

పన్నీర్ పకోడా రెసిపీ,

ఇప్పుడు అవి బాగా ఏదిన తర్వాత పళ్లెంలో వేసుకొని.. ఆనియన్ కరిగి చుట్టూ గార్నిష్ చేసుకుని.. బయట వర్షం చూస్తూ లోపల ఈ పకోడా తింటూ ఉంటే.. ఇక ఆనందం చెప్పనలిమి కాదు.