Add Zee Business As A Preferred Source
App

Schools Holiday: విద్యార్థులకు మళ్లీ బంపర్ జాక్ పాట్.. అన్ని స్కూళ్లు, కాలేజీలకు హలీడే.. ఎక్కడంటే..?

Written ByInamdar Paresh
Published: Oct 28, 2025, 05:17 PM IST|Updated: Oct 28, 2025, 05:21 PM IST

Montha Cyclone Effect:  మొంథా ప్రభావంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో కాంచీపురం, తిరునల్వేలి, కన్యాకుమారిలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆయా జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవుల్ని ప్రకటించారు.
 

Montha cyclone:1/6

మొంథా ప్రభావం:

మొంథా తుపాన్  ప్రభావంతో దేశంలోని పలురాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఈక్రమంలో ఇప్పటికే ఏపీ, తమిళనాడుతో పాటు , తెలంగాణ కూడా మొంథా ఎఫెక్ట్ కు గురయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీగా వానలు పడుతున్నాయి.

cyclone montha effect:2/6

స్కూళ్లకు హలీడే:

బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలమైన వాయుగుండంగా మారింది. ప్రస్తుతం మొంథా తుపాను అత్యంత వేగంగా తీరానికి సమీపిస్తోందని, ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు  వివరించారు.   

Heavy rains:3/6

భారీ వర్షాలు మొంథా ఎఫెక్ట్:

మొంథా తుపాన్ ప్రభావం తమిళనాడుపై కూడా ఉంది. ఈక్రమంలో తమిళనాడులో కుంత పోతగా వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా.. కాంచీపురం, తిరునల్వేలి, కన్యాకుమారిలో కుండపోతగా వానలు పడుతున్నాయి.

tamil nadu:4/6

స్కూళ్లు బంద్:

మరోవైపు  చెన్నైలో ఎడతెరిపిలేకుండా వర్షంకురుస్తుంది.ఈ నేపథ్యంలో..  చెన్నై, తిరువళ్లూరు,కన్యాకుమరి  జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.  భారీ వర్షాలతో తమిళనాడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   

cyclone montha effect:5/6

తమిళనాడు:

ఈ నేపథ్యంలో రేపు అన్ని స్కూళ్లు, కాలేజీలకు తమిళనాడు ప్రభుత్వం ముఖ్యంగా.. చెన్నై, తిరువళ్లూరు,కన్యాకుమరి  జిల్లాలకు  సెలవుల్ని ప్రకటిస్తు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  అధికారులు పలు సూచనలు చేశారు.  

montha cyclone effect:6/6

మొంతా తుపాన్:

తుఫాన్‌ ప్రభావంతో అంతకంతకు  గాలుల తీవ్రత పెరిగిపోతుంది. గరిష్టంగా 100-110 కిలో మీటర్లకు ఈదురుగాలుల తీవ్రత చేరుకుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్‌ ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.