DA Hike: దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అందించబోతోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపుపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DA రేటు 55 శాతం వద్ద ఉంది. ఈసారి దాన్ని మరో 3 శాతం పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపు అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా 1.2 కోట్లకు పైగా ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి నేరుగా లాభం కలగనుంది.
1/7సాధారణంగా DA పెంపు ప్రతి సంవత్సరం రెండుసార్లు ప్రకటిస్తారు. ఒకసారి జనవరి నెల నుంచి, మరోసారి జూలై నెల నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అయితే, ప్రకటించే సమయం మాత్రం ఫిబ్రవరి-మార్చి లేదా సెప్టెంబర్-అక్టోబర్‌లో ఉంటుంది. పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి దీపావళికి ముందే ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
2/7DA పెంపు నిర్ణయం ఎప్పుడూ యాదృచ్ఛికంగా తీసుకోరు. దీనికి ప్రత్యేకమైన గణన విధానం ఉంటుంది. కార్మిక బ్యూరో ప్రతి నెలా విడుదల చేసే వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగానే ఇది లెక్కిస్తారు. గత 12 నెలల CPI-IW డేటాను తీసుకుని, 7వ వేతన సంఘం కింద రూపొందించిన సూత్రం ప్రకారం పెంపు శాతం నిర్ణయిస్తారు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు DA కూడా పెరిగి ఉద్యోగులపై భారం తగ్గేలా చేస్తుంది.
3/7ఇప్పుడు ఉదాహరణగా చూద్దాం. ఒక ఉద్యోగి బేసిక్ జీతం రూ. 50వేలు అనుకుందాం. గతంలో అతను 55శతం డీఏతో రూ. 27,500 పొందేవాడు. ఇప్పుడు అతను 58శాతంతో డీఏ రేటుతో రూ. 29వేలు పొందుతాడు.
4/7అంటే అతను ప్రతినెలా రూ. 1500 ఎక్కువగా పొందుతాడు. అదే విధంగా ఒక పెన్షనర్ బేసిక్ పెన్షనర్ రూ. 30వేలు అయితే అతను 55శాతం డీఆర్ వద్ద రూ. 16,500 పొందుతున్నాు. ఇప్పుడు 58శాతం డీఏ తో 17400 పొందుతాడు. అంటే ప్రతినెలా 900 రూపాయల ప్రయోజనం ఉంటుంది.
5/7జీతం, పెన్షన్ మొత్తాన్ని బట్టి ప్రయోజనం చేకూరుతుంది. కానీ మొత్తం మీద ఈ పెరుగుదల 1.2కోట్లకుపైగా కుటుంబాలకు ఎంతో మేలు కలిగిస్తుందని చెప్పవచ్చు. కొత్త డీఏను అక్టోబర్ జీతంలో జులై , ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలతోపాటు ఇవ్వడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు కలిసి అదనపు డబ్బును పొందుతారు. పండగలు సీజన్ రావడం, ఖర్చులు పెరిగే సమయంలో ఈ డబ్బు బోనస్ వలే పనిచేస్తుంది.
6/7మొత్తం మీద, ఈ డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ కానుకలా నిలుస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ఖర్చులను సమతుల్యం చేసుకోవడానికి ఇది ఎంతో సహాకారంగా ఉంటుంది. అంతేకాకుండా, 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఉన్న ఉత్కంఠ మధ్య ఈ DA పెంపు వారికి తాత్కాలిక సాంత్వతను కలిగిస్తుందని చెప్పుకోవచ్చు.
7/7ఈ పెంపు 7వ వేతన సంఘం కింద చివరి డీఏ పెంపు కావడం గమనార్హం. 7వ వేతన సంఘం 2025 డిసెంబర్ 31న ముగుస్తుంది. ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని జనవరి 2025లో ప్రకటించింది. అయితే, దాని చైర్మన్, సభ్యులు , నిబంధనలను ఇంకా నిర్ణయించలేదు. దాని సిఫార్సులు 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో అమలు అవుతాయని చెబుతున్నారు. 8వ వేతన సంఘం అమలు చేయకుంటే.. డీఏ మరోసారి సున్నా నుండి ప్రారంభమవుతుంది. ద్రవ్యోల్బణం ప్రకారం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది.