Deepika Padukone Daughter: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పడుకోణె, రణ్‌వీర్ సింగ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు.. సెప్టెంబర్ 8, 2024న కూతురు జన్మించిన విషయం తెలిసిందే. పాపకి దువా అని పేరు పెట్టిన ఈ జంట.. తాజాగా తమ ముద్దుల పాప ఫేస్‌ను రివీల్ చేశారు. ఇన్నాళ్లు తమ గారాలపట్టి ముఖాన్ని సోషల్ మీడియా కంటపడకుండా అలర్ట్‌గా ఉన్న దీపికా, రణ్‌వీర్ దంపతులు.. ఎట్టకేలకు ఫ్యాన్స్‌కు దువాను ఇంట్రడ్యూస్ చేశారు.
1/5దీపికా పడుకోణె, రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ అందమైన జంటల్లో ఒకరు. ఈ కపుల్ తమ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా తమ ముద్దుల కూతురు దువా ముఖాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.
2/5ఇక ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్.. తెగ మురిసిపోతున్నారు. ముద్దుగా రెండు పిలకలు వేసుకొని ఎంతో క్యూట్‌గా ఉంది దువా. సేమ్ నాన్న రణ్‌వీర్ సింగ్‌లా ఉంది.. అలాగే అమ్మ దీపికా డింపుల్స్ కూడా వచ్చాయంటూ.. అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
3/5దీపికా, దువా డార్క్ మెరూన్ కలర్ డ్రెస్సులు వేసుకోగా.. రణ్‌వీర్ సింగ్ వైట్ కుర్తా పైజామా ధరించి.. అందమైన చిరునవ్వులతో ఫొటోలకి ఫోజులిచ్చారు. ప్రస్తుతం దీపికా పడుకోణె షేర్ చేసిన దువా ఫోటోస్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
4/5గత దీపావళికి తమ కూతురు దువా పడుకొణే సింగ్‌ను పరిచయం చేశారు దీపికా, రణ్‌వీర్. దువా.. అంటే ప్రార్థన అని.. తమ చిన్నారి మా ప్రార్థనలకు సమాధానమని.. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండి ఉన్నాయని పోస్ట్ చేశారు.
5/5ఇక దీపికా పడుకోణె చివరిసారిగా కల్కి 2898 ఏడీ, జవాన్ సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్టుతో పాటు ... హిందీలో షారుఖ్ ఖాన్ సరసన మరో సినిమా చేస్తుంది. అలాగే ఆదిత్య ధార్ రాబోయే చిత్రం, ఫర్హాన్ అక్తర్ డాన్ 3లో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు.