Add Zee Business As A Preferred Source
App

Govt Scheme: అక్టోబర్ 1న గుడ్ న్యూస్ వినిపించబోతున్న ప్రభుత్వం.. 40వేల మంది ఆడపిల్లల ఖాతాల్లో ఒకేసారి డబ్బు జమ..!!

Written ByBhoomi
Published: Sep 28, 2025, 10:03 AM IST|Updated: Sep 28, 2025, 10:03 AM IST

Ladli Yojana: ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన లాడ్లీ యోజన కింద వేలాది మంది బాలికలకు ఆర్థిక సహాయం అందుతోంది. తాజాగా ఈ పథకం కింద దాదాపు 40,000 మంది లబ్ధిదారులకు అక్టోబర్ 1న చెల్లింపులు జరగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తల్కటోరా స్టేడియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ చెల్లింపులు అందజేయనున్నారు.

Delhi Ladli Yojana1/8

లబ్ధిదారులందరికీ నిధులు

గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల కేసులను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా 11 జిల్లాల్లో డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్‌లో, పాఠశాల మారినవారు లేదా చదువు ఆపేసినవారి కారణంగా నిలిచిపోయిన దరఖాస్తులను మళ్లీ యాక్టివ్ చేసి, లబ్ధిదారులందరికీ నిధులు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.

Ladli Scheme Benefits2/8

ఈ పథకం కింద పలు ప్రయోజనాలు

లాడ్లీ యోజన అసలు ఉద్దేశ్యం బాలికలకు విద్యలో ఆర్థిక భద్రత కల్పించడం. ఈ పథకం 2008 జనవరి 1న ప్రారంభించింది. ఢిల్లీలో జన్మించిన బాలికలకు ఈ పథకం కింద పలు ప్రయోజనాలు అందుతాయి. ఆసుపత్రిలో జన్మించిన ప్రతి బాలికకు రూ.11,000, ఇంటి ప్రసవానికి రూ.10,000 ఒకేసారి జమ అవుతుంది.  

Delhi Girl Child Scheme3/8

ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో

అదనంగా, 1వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతుల్లో అడ్మిషన్ సమయంలో ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున జమ అవుతుంది. ఈ మొత్తం నేరుగా ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో టర్మ్ డిపాజిట్ రూపంలో భద్రపరుస్తారు. దీనిపై వడ్డీ కూడా చేరుతుంది. 

October 1 Ladli Payments4/8

వృత్తి శిక్షణ లేదా చిన్న వ్యాపారాన్ని

బాలిక 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత లేదా 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. తద్వారా, ఉన్నత విద్య, వృత్తి శిక్షణ లేదా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ నిధిని వినియోగించుకోవచ్చు.

 Delhi Government Scheme for Girls5/8

అర్హత నిబంధనలు

అయితే, లాడ్లీ యోజనను పొందడానికి కొన్ని అర్హత నిబంధనలు ఉన్నాయి. బాలిక తప్పనిసరిగా ఢిల్లీలో జన్మించి ఉండాలి. కుటుంబం కనీసం మూడు సంవత్సరాలుగా ఢిల్లీలో నివసిస్తుండాలి. వార్షిక కుటుంబ ఆదాయం రూ. 1 లక్ష కంటే ఎక్కువ కాకూడదు. 

Girl Child Empowerment6/8

ఇద్దరు కుమార్తెలకు మాత్రమే ఈ పథకం

ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు కుమార్తెలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే, బాలిక ఢిల్లీ ప్రభుత్వం, MCD లేదా NDMC గుర్తించిన పాఠశాలలో చదువుతూ ఉండాలి. ఈ నియమాలను పాటించిన వారు మాత్రమే లాడ్లీ యోజన ప్రయోజనాలను పొందగలరు.

Delhi Government Scheme for Girls7/8

బాలికల భవిష్యత్తును సురక్షితం

ఈ పథకం ప్రధాన లక్ష్యం బాలికల భవిష్యత్తును సురక్షితం చేయడం. చిన్న వయసులోనే ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా కుటుంబాలు చదువులో కొనసాగించేందుకు ఆసక్తి చూపేలా చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. బాలికలు పాఠశాలను మధ్యలో మానేయకుండా, ఉన్నత విద్య వరకు చదువుకునేలా చేయడమే కాకుండా, వారి సాధికారతకు దోహదపడేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యం. 

Girl Child Empowerment8/8

వేలాది కుటుంబాలకు ఉపశమనం

అక్టోబర్ 1న జరగబోయే చెల్లింపులు వేలాది కుటుంబాలకు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ విధంగా, లాడ్లీ యోజన ఢిల్లీలోని బాలికల విద్యా ప్రగతికి, ఆర్థిక భద్రతకు, భవిష్యత్తు సాధికారతకు బలమైన పునాది వేస్తోందని చెప్పవచ్చు.