Add Zee Business As A Preferred Source
App

Police Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 7,565 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. చివరి తేదీ ఇదే..!!

Written ByBhoomi
Published: Sep 23, 2025, 12:02 PM IST|Updated: Sep 23, 2025, 12:02 PM IST


Delhi Police Constable Vacancy 2025:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది స్టాప్ సెలక్షన్ కమిషన్. 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 4,408, మహిళలకు 2,496 ఎక్స్ సర్వీస్ మెన్స్ కు మిగతా పోస్టులను కేటాయించింది. అక్టోబర్ 21 లోపు ssc.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ఉత్తీర్ణులై 18 నుంచి 25ఏల్ల వయస్సున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు5, ఓబీసీలకు 3ఏళ్ల సడలింపు ఉంటుంది. నెలకు జీతం 21వేల నుంచి 69వేల వరకు ఉంటుందని నోటిఫికేషన్ లోపేర్కొంది. 

SSC Recruitment20251/6

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 2025

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 2025.. ఢిల్లీ పోలీస్‌లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7,565 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది.  ఇందులో పురుషులు, మహిళల కోసం వేర్వేరు కేటగిరీలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌లోని అన్ని వివరాలు, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం ఎంపిక ప్రక్రియ SSC అధికారిక వెబ్‌సైట్ (ssc.gov.in) పూర్తి వివరాలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 21, 2025లోపు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. 

SSC Delhi Police2/6

18–25 సంవత్సరాల మధ్య ఉండాలి

ఈ పోస్టులకు అర్హత 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  వయోపరిమితి 01-07-2025 నాటికి 18–25 సంవత్సరాల మధ్య ఉండాలి. కేటగిరీ అనుగుణంగా ప్రభుత్వం వయో సడలింపులు అందిస్తుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక కొలతలు, శారీరక సామర్థ్య పరీక్షలు (PET/PST) ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ద్వారా జరుగుతుంది.

Constable Jobs20253/6

కంప్యూటర్ ఆధారిత పరీక్ష

కంప్యూటర్ ఆధారిత పరీక్షలో నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, సంఖ్యా సామర్థ్యం, కంప్యూటర్ ఫండమెంటల్స్ వంటి అంశాలు ఉంటాయి. మొత్తం 100 మార్కుల పరీక్షలో, జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ 50 మార్కులు, రీజనింగ్ 25 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 15 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 10 మార్కులు ఇవ్వనున్నారు. 

SSC Apply Online4/6

4,408 పోస్టులు

ఖాళీల విభజనలో 4,408 పోస్టులు పురుషుల ఎగ్జిక్యూటివ్, 285 పురుషుల మాజీ సైనికులు (ఇతరులు), 376 పురుషుల మాజీ సైనికులు (కమాండో), 2,496 మహిళల ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 7,565 ఖాళీలు ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.   

Delhi Police Constable 20255/6

SSC వెబ్‌సైట్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్

దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు SSC వెబ్‌సైట్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను ఎంచుకోవాలని కమిషన్ సూచించింది. ఫారమ్ నింపిన తర్వాత, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, దరఖాస్తు ఫీజును చెల్లించాలి.

SSC Delhi Police Recruitment 20256/6

స్థిరమైన ఉద్యోగ అవకాశం

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా యువతకు పోలీస్ విభాగంలో స్థిరమైన ఉద్యోగ అవకాశం లభిస్తోంది. అభ్యర్థులు పరీక్షా విధానం, ఖాళీల వివరాలు, వయోపరిమితి, అర్హత ప్రమాణాలను SSC అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించాలి. భవిష్యత్తులో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని అప్డేట్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వెలువడతాయి.