Pawan Kalyan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

Pawan kalyan files pitition in delhi high court: కొంత మంది సోషల్ మీడియాలో ఫెక్  ప్రచారాలు, వ్యక్తిత్వ గౌరవంకు భంగం కలిగే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ పవన్ కళ్యాన్ ప్రస్తుతం ఢిల్లి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పలువురు టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ నటులు కూడా ఢిల్లీ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
 

1 /6

ఇటీవల సోషల్ మీడియాలొ కొంత మంది పేట్రేగిపోయారు. ముఖ్యంగా సాధారణ జనాలు నుంచి వీఐపీల వరకు ఎవర్ని వదలడంలేదు. తరచుగా నేతలు, సెలబ్రీటీలు ట్రోల్స్ కు గురౌతున్నారు. వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోస్టులు పెడుతూ కొంత మంది పైశాచీక ఆనందం పొందుతున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేసిన ఈ ఘటనలు మాత్రం ఆగడంలేదు.  

2 /6

ఇప్పటికే వ్యక్తిత్వ హననం, పర్సనల్ రైట్స్, సోషల్ మీడియా కాంట్రవర్సీ పోస్టులపై, ఏఐ పోస్టులపై చిరంజీవి, నాగార్జున సైతం ఢిల్లీ హైకోర్టులో నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో తాజాగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ సైతం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.  

3 /6

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా  గత కొన్నిరోజులుగా వ్యక్తిత్వంకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా పోస్టులు చేస్తు కొంత మంది పైశాచీకంగా ప్రవరిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ తరపున లాయర్ లు కోర్టు వారికి దీనిపై పిటిషన్ దాఖలు చేసిన పలు స్క్రీన్ షాట్ లు కూడా జతచేశారు.

4 /6

కావాలని కొంత మంది రాజకీయ నేతలు, సెలబ్రీటీలను టార్గెట్ చేసి కాంట్రవర్సీలు రాజేస్తు పోస్టులు పెడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ తరపు లాయర్ లు కోర్టు వారికి విన్నవించారు. దీంతో చాలా మంది పర్సనల్ జీవితాలు, సమాజంలో గౌరవంకు భంగం కలిగే విధంగా ఈ పోస్టులు ఉన్నాయంటూ చెప్పారు.  

5 /6

ఈ క్రమంలో సదరు కాంట్రవర్సీ పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకొవాలని కోర్టులో పవన్ తరపు లాయర్ లు పిటిషన్ దాఖలు చేశారు . దీనిపై  ధర్మాసనం..  సోషల్ మీడియా హ్యాండిల్స్ అయిన మెటా, గూగుల్, ఎక్స్‌కు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది.

6 /6

ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహర్ పలువురు సెలబ్రీటీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.