Pawan kalyan bhadrachalam Tour: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సాయత్రం రోడ్డు మార్గంలో భద్రచలం వెళ్లనున్నారు. రేపు భద్రచంలంలో రాముల వారి సన్నిధిలో జరగబోయే కళ్యాణోత్సవంలో పాల్గొననున్నారు. రాముల వారికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను జనసేనాని స్వామి వారికి సమర్పించనున్నారు.
దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలకు ఆలయాలన్ని ఎంతో అందంగా ముస్తాబయ్యాయి. తెలంగాణలో ఖమ్మంలో ఉన్న భద్రాచలంలో రాముల వారి కళ్యాణోత్సవం ఎంతో వేడుకగా నిర్వహిస్తారు.ఈ రోజున స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తుల పొటెత్తి మరీ వస్తుంటారు.
భద్రచలంలో శ్రీరామ నవమి ఉత్సవాలలో అనాదీగా ప్రభుత్వం తరపున వస్త్రాలను సమర్పిస్తారు. ఈ సారి కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లు తదితరులు మంత్రులు ఖమ్మంలో జరిగే ఉత్సవాలలో పాల్గొననున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం.. నేడు మధ్యాహ్నం హైదరబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మంకు వెళ్లనున్నారు.ఈ మేరకు డిప్యూటీ సీఎం పర్సనల్ అధికారులు, తెలంగాణ పోలీసులకు రోడ్డు మార్గంలో వెళ్లే షెడ్యూల్ ను పంపించారు. డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఆయా పరిధిల్లో అధికారులు భద్రత కల్పించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు.
పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం రోడ్డు మార్గంలో బయలుదేరీ రాత్రి వరకు భద్రచలం చేరుకుంటారు. ఆ తర్వాత మరుసటి రోజు శ్రీరామయ్య సన్నిధిలో కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. స్వామి వారికి ప్రత్యేకంగా వస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తారు. అదే విధంగా స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్ అధికారులు ఒక షెడ్యూల్ ను విడుదల చేశారు.
అసలే ఖమ్మంలో శ్రీరామ నవమి రోజున భారీగా భక్తులు వస్తారు. మరోవైపు వరుసగా వీఐపీలు కూడా రానుండటంతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. పవన్ ను చూసేందుకు అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడ కూడా తొక్కిసలాట వంటి ఘటనలు జరక్కుండా అధికారులు, ఇతరు శాఖలతో సమన్వయం చేసుకుని బారికెడ్లను సైతం ఏర్పాట్లు చేయిస్తున్నారు.