Pawan Kalyan: నాకు డబ్బే ప్రదానం.. ఎవరు వద్దన్న ఆ పనిచేస్తా..!.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..

Deputy cm Pawan kalyna on movies: డిప్యూటీ  సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తన సినిమాల గురించిన సంచలన వ్యాఖ్యలుచేశారు. ఎవరు ఏమన్నా.. కూడా సినిమాలు చేస్తునే.. మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటానని జనసేనాని అన్నారు.
 

1 /5

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి సర్కారు ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హమీలను అమలు చేసేదిశగా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో ఏమాత్రం రాజీపడకుండా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.  

2 /5

తాను సినిమాలు చేస్తునే రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటానన్నారు. తనకు మరో బిజినెస్ లు కానీ, మరే ఇతర వ్యాపారాలు కానీ , ఆదాయ మార్గాలు కానీ లేవని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయడానికన్నారు. డబ్బుల అవసరం ఉన్నంత వరకు తాను సినిమాలు చేస్తునే ఉంటానన్నారు.  రాజకీయాల్లోకి వచ్చి చాలా మంది డబ్బుల్ని సంపాదించేవాళ్లను చూశారు.. కానీ తాను అలాంటి వారికి పూర్తిగా వ్యతిరేకమన్నారు.    

3 /5

ఒకవైపున సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాన్ ఎత్తుకున్న నినాదంతో ఆయన దేశ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పవన్ కళ్యాన్ సినిమాల గురించి అపోసిషన్ పార్టీల నేతలు ట్రోల్స్ చేశారు.ఈ క్రమంలో తాజాగా.. పవన్ దీనిపై స్పందించారు. ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పవన్ చివరిగా 2023లో ‘బ్రో’ మూవీలో కనిపించిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని పవన్ వెల్లడించారు.  

4 /5

అదే విధంగా.. సుజీత్ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈక్రమంలో పవన్ మాటల్ని బట్టి చూస్తుంటే.. సినిమాలకు పవన్ గుడ్ బై చెప్పే చాన్స్ అస్సలు లేదని.. రాబోయే రోజుల్లో ఒకవైపు మూవీస్ చేస్తునే మరోవైపు రాజకీయాల్లో తనదైన చాణక్యంతో ముందుకు వెళ్తారని  స్పష్టంగా అర్థమౌతుంది.

5 /5

మరోవైపు పవన్ మాటలను బట్టి చూస్తుంటే సినిమాలకు గుడ్ బై చెప్పే ఛాన్సే లేదని, రాబోయే రోజుల్లో సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రజా సేవలో ముందుకు సాగుతారని స్పష్టంగా తెలుస్తోంది.