Add Zee Business As A Preferred Source
App

Dhana Shree Verma: పెళ్లయిన రెండు నెలలకే చీటింగ్ చేస్తూ దొరికిపోయాడు.. క్రికెటర్ చాహల్‌పై మాజీ భార్య ధనశ్రీ సంచలన ఆరోపణలు

Written ByAruna Maharaju
Published: Sep 30, 2025, 09:10 AM IST|Updated: Sep 30, 2025, 09:10 AM IST

Dhana Shree Verma Allegations On Chahal: టీమిండియా సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‎పై అతడి మాజీ భార్య ధనశ్రీ వర్మ సంచలన ఆరోపణలు చేసింది. చాహల్ తనను మోసం చేశాడని.. తమ పెళ్లయిన రెండు నెలలకే చీటింగ్ చేస్తున్నట్లు కనిపెట్టానని.. తాజాగా ఓ రియాల్టీ షోలో పాల్గొన్న ధనశ్రీ ఆరోపించింది. దీంతో ఇప్పుడు చాహల్‌పై ధనశ్రీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

Team India Cricketer Yuzvendra Chahal1/6

టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్

టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ డివొర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

Team India Cricketer Yuzvendra Chahal2/6

కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ

తాజాగా ఓ రియాలిటీ షోలో ఎక్స్ హజ్బెండ్ చాహల్‌పై ధనశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లయిన రెండో నెలకే చాహల్ తనను మోసం చేస్తున్నట్లు గుర్తించానని చెప్పింది.  

Dhana Shree Verma Allegations3/6

చాహల్‌పై మాజీ భార్య ధనశ్రీ సంచలన ఆరోపణలు

మీ వివాహ బంధం ఇక ముందుకు సాగదని మీరు ఎప్పుడు గుర్తించారని ధనశ్రీని అడుగగా.. ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. తమ పెళ్లి అయిన రెండో నెలలోనే చాహల్ తనను చీటింగ్ చేస్తున్నట్లు గుర్తించానని తెలిపింది. 

Dhana Shree Verma Allegations4/6

యజ్వేంద్ర చాహల్‎ విడాకులు

అప్పటి నుంచి తమ వైవాహిక జీవితంలో విబేధాలు వచ్చాయని.. ఇకపై కలిసి ముందుకు సాగలేమని అప్పుడే నిర్ణయించుకున్నామని ధనశ్రీ వెల్లడించింది. దీంతో ధనశ్రీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Yuzvendra Chahal5/6

క్రికెటర్ చాహల్‌పై మాజీ భార్య ధనశ్రీ సంచలన ఆరోపణలు

చాహల్, ధనశ్రీ వర్మ 2020, డిసెంబర్ 22న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి వివాహ బంధంలో 2022లో మనస్పర్ధాలు తలెత్తాయి. దీంతో అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఇక కలిసి ఉండలేమని నిర్ణయించుకుని.. డివొర్స్ తీసుకుని ఎవరి దారి వారు చూసుకోవాలని డిసైడ్ అయ్యారు.  

Dhana Shree Verma6/6

క్రికెటర్ చాహల్‌

ఇందులో భాగంగానే పరస్పర అంగీకారంతో ముంబై ఫ్యామిలీ కోర్టులో డివొర్స్ కోసం ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు. 2025, మార్చి 20న ముంబై ఫ్యామిలీ కోర్టు వీరికి అధికారికంగా డివొర్స్ మంజూరు చేసింది. దీంతో చాహల్, ధనశ్రీ వర్మల పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడింది.