Dharmendra Second Marriage Controversy: హేమామాలినిని రెండో పెళ్లి చేసుకోవడానికి ధర్మేంద్ర ఇస్లాం మతంలోకి మారాడా..!

Dharmendra Hema Malini Marriage Controversy: ధర్మేంద్ర సినిమాల్లో నటిస్తున్నపుడే తన తోటి నటి హేమ మాలినిని ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని గాఢంగా ప్రేమించింది. అలా కొన్న సినిమాల్లో కలిసి నటించిన తర్వాత 1980లో తన మొదటి భార్య ప్రకాష్ కౌర్‌కు విడాకులు ఇవ్వకుండానే హేమ మాలినిని రెండవసారి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా అతను ఇస్లాం మతంలోకి మారడం మరో పెద్ద సంచలనం.  

1 /6

ధర్మేంద్ర బాలీవుడ్ హీ మ్యాన్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటే..  తన అద్భుతమైన నటనతో పాటు అందంతో అభిమానుల కలల రాకుమారిగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా హేమ మాలిని గుర్తింపు తెచ్చుకుంది. ఇక ధర్మేంద్ర, హేమా మాలినిల ప్రేమాయణంతో పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అని చెప్పాలి. 

2 /6

హేమ మాలిని, ధర్మేంద్ర 1980న మే 2 వివాహం చేసుకున్నారు. ధర్మేంద్ర తన మొదటి భార్య ప్రకాష్ కౌర్‌కు విడాకులు ఇవ్వకుండానే హేమ మాలినిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెను దుమారమే రేపింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడం అనేది  ఇది హిందూ వివాహ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం.

3 /6

1979లో ధర్మేంద్ర, హేమ మాలిని ఇస్లాం మతంలోకి మారి వివాహం చేసుకున్నట్లు సమాచారం.  ఇస్లాంలో బహు భార్యత్వంపై నిషేధం లేదు. ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవడానికి ధర్మేంద్ర తన పేరును దిలావర్‌గా మార్చుకోగా హేమ తన పేరును ఆయేషా బిగా మార్చుకున్నారట.

4 /6

ధర్మేంద్ర,హేమ తమ మొదటి భార్యలకు విడాకులు ఇచ్చిన తర్వాతే అయ్యంగార్ ఆచారాల ప్రకారం రెండవ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ కమల్ ముఖర్జీ రాసిన 'హేమ మాలిని: బియాండ్ ది డ్రీమ్ గర్ల్' పుస్తకంలో, హేమ మాలిని తనపై వచ్చిన ఆరోపణలపై కుండ బద్దలు కొట్టింది.    

5 /6

అవును.. ఎవరైనా ఏదైనా పెద్ద పని చేసినప్పుడు.. కొంతమంది వారిని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ అతను (ధర్మేంద్ర) అందులో విజయం సాధిస్తాడని నాకు తెలుసు హేమా మాలిని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ధర్మేంద్ర తనను రెండవ భార్యగా అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదని అడిగినప్పుడు, హేమ ఇలా అన్నారు.  ఇది మా మధ్య ఉన్న వ్యక్తిగత విషయం. మేము దానిని మేమే పరిష్కరించుకుంటాము. దీని గురించి మరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

6 /6

అదే సమయంలో, వివాహం కోసం ఇస్లాం మతంలోకి కన్వర్ట్ కావడం.. పేరు మార్చుకోవడం వంటి వార్తల గురించి పాత ఇంటర్వ్యూలో ధర్మేంద్ర  స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు పూర్తిగా అబద్ధం. నేను నా స్వంత ప్రయోజనాల కోసం మతం మారే వ్యక్తిని కాదన్నారు. ఈ ఆరోపణలలో ఏదైనా నిజం ఉంటే, ఎవరైనా దానిని ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ఏది ఏమైనా ఈ విషయం ధర్మేంద్ర, హేమా మాలినిల విషయంలో కంటిన్యూ అవుతూనే ఉంది.