Prabhas Wishes Rashmi: టెలివిజన్ యాంకర్‌గా రష్మీ గౌతమ్ అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ ఇచ్చిన స్పెషల్ సర్‌ప్రైజ్ సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.
తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది రష్మీ గౌతమ్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తన చురుకైన వ్యాఖ్యలు, హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా టెలివిజన్ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించింది.
మొదట్లో గుంటూరు టాకీస్ లాంటి సినిమాలలో కనిపించిన రష్మీ ఆ తర్వాత మాత్రం ఈ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా ఎక్కువగా పేరు సంపాదించుకుంది. ఇక ఈ మధ్య కూడా కొన్ని చిన్న చిన్న సినిమాలలో కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ మధ్య రష్మీ లైఫ్ లో జరిగిన ఒక విషయం తెగ వైరల్ అవుతుంది.
తాజాగా ఈటీవీలో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రష్మీ పుట్టిన రోజు.. వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ ఎపిసోడ్ లో జరిగిన ఒక సంఘటన..ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సందర్భంగా బుల్లెట్ భాస్కర్ ఒక స్పెషల్ వీడియో చూపించారు. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..రష్మీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియో మెసేజ్ పంపించారు. ఇది చూసి ఆ షోలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.
తమ అభిమాన హీరో నుంచి స్పెషల్ విషెస్ రావడంతో రష్మీ ఆనందానికి అవధులు.. లేకుండా పోయింది. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా షోలో పాల్గొన్న ఇతర ఆర్టిస్టులు కూడా ఆమెతో కలిసి కేక్ కట్ చేసి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరిపారు. ఇంద్రజ, హైపర్ ఆది, రాం ప్రసాద్, తాగుబోతు రమేష్, భాస్కర్ లాంటి ప్రముఖులు రష్మీ పట్ల ప్రేమను చాటారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రభాస్ కి ఎందుకు ఈ యాంకర్ అంటే అంతటి అభిమానమని అందరూ అనుమానంతో కామెంట్లు పెట్టసాగారు. తీరా చివరికి అది ఆ టీవీ టీం క్రియేట్ చేసిన వీడియో అని తెలుస్తోంది.
రష్మీ గౌతమ్ ప్రస్తుతం రెండు ప్రముఖ కామెడీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. వారానికి రెండు లేదా మూడు రోజులు టెలివిజన్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఈ స్థాయిలో ఓ మహిళా యాంకర్‌గా స్థిరపడటం నిజంగా ప్రేరణగా మారుతోంది. ఏప్రిల్ 27న ఈ బర్త్‌డే ఎపిసోడ్ పూర్తి స్థాయిలో ప్రసారం కానుండటం విశేషం. కాగా ఈ మధ్యనే రష్మీ చిన్న ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే.