Celebrity relations
శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన శ్రీకాంత్ భార్య ఊహ కూడా హీరోయిన్గా చేసింది. అంతేకాదు శ్రీకాంత్ అక్క కూతురుని.. హీరో గోపీచంద్ కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంతగా సినిమా వాళ్లతో అనుబంధం ఉన్న శ్రీకాంత్ లైఫ్ లో మరో సెలబ్రిటీ బంధువు కూడా ఉంది. ఇంతకీ ఆమె ఎవరంటే..
?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ సినిమా అతని కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా ప్రభాస్‌కు మాస్ హీరోగా మరింత గుర్తింపు తీసుకువచ్చింది. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ మిశ్రమంగా ఉన్న ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది.
ఈ సినిమాలో ప్రభాస్ నటన, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలో సూరీడు పాత్ర ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. తల్లి కొడుకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కదిలించాయి. ఇందులో ప్రభాస్ తల్లిగా కనిపించిన నటి గుర్తుందా? ఆమె పేరు అనితా చౌదరీ.
అనితా చౌదరీ చాలా సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించారు. మురారి, సంతోషం, నువ్వే నువ్వే వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఆమె సీనియర్ హీరో శ్రీకాంత్‌కి చెల్లెలు అవుతారు. అనితా చౌదరీ భర్త, శ్రీకాంత్ కజిన్స్ అవుతారు. అంటే ఆమె శ్రీకాంత్‌కు చెల్లెలు వరస అవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ప్రస్తుతం ప్రభాస్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ‘సలార్’ సినిమా ఘనవిజయం సాధించడంతో, ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 AD’ సినిమా కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.